News


ఏడాదిన్నర కనిష్టానికి ఐటీసీ

Monday 5th August 2019
Markets_main1564998946.png-27551

ఐటీసీ షేర్లు సోమవారం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఏడాదిన్నర కనిష్టానికి పతనమయ్యాయి. తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేపోవడం,  బ్రోకరేజ్‌ సంస్థలు ఐటీసీ షేర్లపై కొనుగోళ్ల టార్గెట్‌ ధరను తగ్గించడం ఇందుకు కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.265.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒకదశలో షేరు రూ.2.50శాతం నష్టపోయి రూ.257.60ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ధర షేరు ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.264.6)తో పోలిస్తే 2శాతం నష్టంతో రూ.257.60ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 257.60  రూ.322.70లుగా నమోదయ్యాయి. 
అంచనాలను అందుకోని క్యూ1 ఫలితాలు:- ఈ ఆర్థిక సంత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 12.6శాతం వృద్ధి చెంది రూ.3,173.9 కోట్లను ఆర్జించింది. ఆదాయం రూ.11, 502కోట్లను సాధించింది. అయితే విశ్లేషకులు మాత్రం ఈ క్యూ1లో రూ.11, 565 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. తన మొత్తం వ్యాపారంలో 47శాతం వాటా కలిగిన సిగరెట్‌ వ్యాపారంలో 6శాతం వృద్ధిని సాధించింది. వ్యాల్యూమ్‌ వృద్ధి విశ్లేషకులు 5శాతం అంచనావేయగా, అందుకు భిన్నంగా 3శాతం వృద్థిని నమోదు చేసింది. అలాగే ఎఫ్‌ఎంజీసీ విభాగపు ఆదాయాన్ని విశ్లేషకులు 10శాతం అంచనా వేయగా, 7శాతం వృద్ధిని కనబరిచింది.

బ్రోకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ తగ్గింపు:- 
మోర్గాన్‌ స్టాన్లీ:- ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని వ్యాపార రంగ విభాగాల్లో ఎబిటా వృద్ధి మా అంచనాలకు అందుకోలేకపోయింది. షేరుకు ఓవర్‌వెయిర్‌ రేటింగ్‌ కేటాయింపుతో పాటు షేరు కొనుగోలు ధరను రూ.360కు తగ్గిస్తున్నాం.
హెచ్‌ఎస్‌బీసీ:- క్యూ1లో సిగరేట్‌ వ్యాపార వ్యాల్యూమ్స్‌ వృద్ధి అంచనాలకు అందుకోలేపోయింది. అయితే వాల్యూవేషన్స్‌ అధికంగా ఉన్నాయి. టాక్సియేషన్‌ మార్గం ఇంకా కీలక రిస్క్‌గానే ఉంది. కావున షేరుకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. అయితే, షేరు కొనుగోలు ధరను మాత్రం రూ.330 నుంచి రూ.320కు తగ్గిస్తున్నాము.
సీఎల్‌ఎస్‌ఏ:- షేరు ఆకర్షణీయమైన రిస్క్‌ రివార్డును కలిగింది. కనుకు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. అలాగే షేరు కొనుగోలు ధరను రూ.365గా నిర్ణయించింది.



You may be interested

ఎయిర్‌టెల్‌ మరో 4 శాతం జంప్‌

Monday 5th August 2019

మార్కెట్లు నిలువునా పతనమవుతన్నా....ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 ఫలితాలను ప్రకటించిన తర్వాత నుంచి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఎయిర్‌టెల్‌ సోమవారం ట్రేడింగ్‌లో 4.53 శాతం లాభపడి రూ. 359.10 వద్ద ముగిసింది. కాగా మార్కెట్లు తీవ్రంగా నష్టపోయినప్పటికి ఎయిర్‌టెల్‌ మాత్రం లాభపడి ముగియడం గమనార్హం. గత సెషన్‌లో కూడా ఈ కంపెనీ షేరు 6 శాతం లాభపడి రూ. 343.55 వద్ద క్లోజయ్యింది.  మొత్తంగా ఈ రెండు

పతనానికి ప్రధాన కారణాలివే!

Monday 5th August 2019

దేశియ ఈక్విటీ మార్కెట్ల పతనం సోమవారం కూడా కొనసాగుతునే ఉంది. నిఫ్టీ కిలకమైన 10,850 స్థాయిని కాపాడుకోలేకపోయింది. ఆసియా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో పాటు, ట్రేడ్‌ వార్‌ భయాల వలన చైనా కరెన్సీ యువాన్‌ డాలర్‌ మారకంలో బలహీనపడడం ఇండియా మార్కెట్లపై ప్రభావం చూపింది. చైనా పీఎంఐ డేటా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని స్పష్టం చేయడం, గత వారం వెలువడిన ఫెడ్‌ సమావేశం ఫలితాలు కూడా మార్కెట్‌

Most from this category