STOCKS

News


సిగరెట్‌ ధరల పెంపుతో ఐటీసీ జూమ్‌!

Tuesday 11th February 2020
Markets_main1581393796.png-31677

వివిధ సిగరెట్ల ధరలను వాటి పొడవు ఆధారంగా 10- 12 శాతం మేర పెంచుతున్నట్లు ఐటీసీ ప్రకటించింది. బడ్జెట్లో విధించిన పన్ను భారాన్ని తట్టుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సిగరెట్‌ ధరల పెంపు ప్రకటనతో మంగళవారం ఐటీసీ షేరు ఆరంభ ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం లాభపడింది. సోమవారం క్లోజింగ్‌ రూ. 210.55 కాగా, మంగళవారం రూ. 216.50 వద్ద ఆరంభమైన ఐటీసీ షేరు రూ.216.95 గరిష్ఠాన్ని, రూ.213.85 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం 9.28 గంటలకు 2.02 శాతం లాభంతో 214.85 రూపాయల వద్ద ట్రేడవుతోంది. దాదాపు 75 లక్షల వాల్యూంలు నమోదయ్యాయి. షేరు ఏడాది గరిష్ఠ, కనిష్ఠాలు వరుసగా రూ. 310, రూ.205 వద్ద ఉన్నాయి. బడ్జెట్లో పన్ను భారం పెంచడంతో ఆరోజు షేరు ఏడాది కనిష్ఠాలను తాకింది. అనంతరం కొంచెం కోలుకుంది. ఇప్పటికైతే షేరుపై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌గా లేవు. ధరల పెంపు ప్రయోజనం ఎంతవరకు కంపెనీ సిగరెట్‌ వ్యాపారాన్ని గట్టెక్కిస్తుందో వేచిచూడాలని నిపుణులు చెబుతున్నారు. 


ITC

You may be interested

నిఫ్టీ 120 పాయింట్లు, సెన్సెక్స్‌ 400 పాయింట్లు అప్‌

Tuesday 11th February 2020

  అంతర్జాతీయ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలు కలిసొచ్చిన క్రూడాయిల్‌ ధరల పతనం దేశీయ మార్కెట్‌ రెండురోజుల వరుస నష్టాలకు స్వస్తి పలుకుతూ మంగళవారం లాభంతో మొదలైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 203 పాయింట్ల లాభంతో  41,183.39 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 12100 పైన 12,108.40వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది నిముషాల్లోనే నిఫ్టీ 120 పాయింట్లకుపైగా, సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా జంప్‌చేశాయి.  ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కరోనా వైరస్‌ వ్యాధి భయాలు

యూనియన్‌ బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు

Tuesday 11th February 2020

నాలుగు రెట్లు పెరిగిన నికర లాభం రూ.575 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంకు డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో మంచి పనితీరు ప్రదర్శించింది. బ్యాంకు స్టాండలోన్‌ లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.153 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగి రూ.575 కోట్లకు చేరుకుంది. బ్యాంకు ఆదాయం కూడా రూ.9,573 కోట్ల నుంచి రూ.10,741 కోట్లకు దూసుకుపోయింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)

Most from this category