News


ఐటీ షేర్లకు హెచ్‌ 1 వీసా కష్టాలు

Thursday 20th June 2019
Markets_main1561023238.png-26448

హెచ్‌1బీ వీసాలపై జారీని మరింత పరిమితం చేసేందుకు అమెరికా యోచిస్తుందనే వార్తలు వెలుగులోకి రావడంతో గురువారం ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2శాతం నష్టపోయింది. భారత్‌ స్థానికంగా డాటా నిల్వలు చేసుకునే విదేశీ కంపెనీలపై పరిమితులు విధించేందుకు ప్రయత్నిస్తుందని అమెరికా ఆరోపించింది. డాటా నియమాలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో అమెరికా హెచ్‌1బీ వీసాల జారీలపై పరిమితులను విధించేందుకు సిద్ధమైనట్లు రాయిట్స్‌ కథనాలు వెల్లడయ్యాయి. భారత ఐటీ రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్‌. దీనికి సుమారు 150బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది. అమెరికాలో తమ సర్వీస్‌ క్లైయింట్లకు సేవలు అందించేందుకు ఐటీ ఇంజనీర్లు, డెవలపర్లు ఈ హెచ్‌1బీ వీసాలను వినియోగిస్తారు. ఇప్పుడు అమెరికా హెచ్‌1బీ వీసాలపై పరిమితులను విధిస్తే సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఐటీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌ ఐటీ దిగ్గజ కంపెనీ షేర్లైన విప్రో 2.50శాతం, టెక్‌ మహీం‍ద్రా 2శాతం, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. అయితే మార్కెట్‌ రివకరిలో భాగంగా ఐటీ షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికి తిరిగి కోలుకున్నాయి. మధ్యాహ్నం గం.2:45ని.లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 0.25శాతం స్వల్ప నష్టంతో 16,179.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 300 పాయింట్ల లాభంతో 39, 400ల వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 11,790ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

22.60శాతం లాభంతో ముగిసిన జైన్‌ ఇరిగేషన్‌

Thursday 20th June 2019

జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ షేరు విలువ గురువారం(జూన్‌ 20) ఇంట్రాడేలో 22.60శాతం లాభంతో రూ.24.35 వద్ద ముగిసింది. గత సెషన్‌లో 28శాతం నష్టపోయి జీవిత కాల కనిష్ఠాన్ని తాకిన ఈ షేరు ఇంట్రాడేలో లాభల్లో ట్రేడయ్యింది. ‘కంపెనీ సాధారణ కార్యకలాపాలతోనే ముందుకు సాగుతోందని పెట్టుబడిదారులకు, వాటాదారులకు హామి ఇస్తున్నాం. వేగంగా ఆస్థులను విక్రయించి కంపెనీ అప్పులను తీర్చి బ్యాలన్స్‌ సీట్‌లను కొనసాగించాడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బీఎస్‌ఈ ఫైలింగ్లో జైన్‌

పీఎన్‌బీ మొండిబకాయిల వసూళ్లు రెట్టింపు

Thursday 20th June 2019

బ్యాంక్ వార్షిక నివేదిక న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మొండిబకాయిల (ఎన్‌పీఏ) రికవరీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపయ్యింది. ఈ మొత్తం రూ.20,000 కోట్లు. 2017-18తో పోల్చితే (రూ.9,666 కోట్లు) ఈ మొత్తం దాదాపు రెట్టింపు. బ్యాంక్‌ వార్షిక నివేదికలో చైర్మన్‌ సునిల్‌ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆభరణాల వర్తకులు నీరవ్‌మోదీ, చోక్సీ కొందరు ఉద్యోగులు కుమ్మక్కై చేసిన దాదాపు రూ.11,000 కోట్ల కుంభకోణం 2018 ఫిబ్రవరిలో బ్యాంక్‌ను

Most from this category