News


రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో ఐటీ షేర్లలో అమ్మకాలు..!

Friday 22nd November 2019
Markets_main1574413139.png-29786

ప్రముఖ రేటింగ్‌ సంస్థ గోల్డ్‌మెన్‌ శాష్యూ ఐటీ రంగంపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో శుక్రవారం ఈ రంగానికి చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. దేశీయ ఐటీ రంగం రానున్న రోజుల్లో  చక్రీయ అవరోదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఐటీ రంగ వాల్యూవేషన్‌ చారిత్రాత్మక సగటు కంటే ప్రీమియం స్థాయిలో ఉన్నట్లు రేటింగ్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది. వ్యవస్థలో చక్రీయ మందగమనం ప్రభావం కారణంగా ఆయా ఆయా కంపెనీల షేర్ల ర్యాలీ రానున్న రోజుల్లో ఆశించినస్థాయిలో ఉండకపోవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ​ఈ క్రమంలో విప్రో, టీసీఎల్‌, ఎంఫసీస్‌ షేర్ల రేటింగ్‌ను ‘‘న్యూట్రల్‌’’ స్థాయి నుంచి ‘‘సెల్‌’’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఇక రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీలు మిశ్రమ ఫలితాలను ప్రకటించాయి. హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ కంపెనీలు రెవెన్యూ వృద్ధి, మార్జిన్లు ఆశించిన స్థాయిలో నమోదయ్యాయి. టీసీఎస్‌ మాత్రం రెవెన్యూ, ఎబిటా మార్జిన్ల అంచనాలకు అందుకోవడంలో విఫలమైంది. విప్రో స్థిరమైన ఫలితాలను ప్రకటించింది. ఇన్ఫోసిస్ విజిల్‌బ్లోయర్ ఇష్యూ తర్వాత బాగా దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి వాతావరణం మరో 2నెలల్లో తీరుపోతుంది. లార్జ్‌ క్యాప్ ఐటీ రంగ షేర్లలో మేము ఈ షేరు ఎంపిక చేసుకోవని సలహానిస్తున్నాము అని సెంట్రల్‌ బ్రోకింగ్‌ సంస్థ ఒక నివేదికలో తెలిపింది.

రేటింగ్‌ సంస్థ డౌన్‌గ్రేడ్‌తో ఐటీ షేర్లు నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు (15293.95)తో పోలిస్తే 2.09శాతం నష్టంతో 14,975.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్‌ షేరు అత్యధికంగా 3శాతం నష్టపోయింది. టీసీఎస్‌ షేరు 2.50శాతం, హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా, హెక్సావేర్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. విప్రో, టాటా ఎలాక్సీ షేర్లు 1.50శాతం క్షీణించాయి. మైండ్‌ ట్రీ, ఎన్‌ఐఐటీ టెక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. ఒక్క జస్ట్‌ షేరు మాత్రం 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. You may be interested

నిఫ్టీ టార్గెట్‌13800 !

Friday 22nd November 2019

సీఎల్‌ఎస్‌ఏ అంచనా నిఫ్టీ 12వేల పాయింట్లను దాటేందుకు ఆపసోపాలు పడుతోంది. గత గరిష్ఠం 12100 పాయింట్లను దాటితే అప్‌మూవ్‌ ఉంటుందని నిపుణులు భావిస్తున్నా, నిఫ్టీ ప్రస్తుతానికి 12వేల స్థాయిని విజయవంతంగా అధిగమించలేకపోతోంది. ఇక్కడకు వచ్చినప్పుడల్లా ప్రాఫిట్‌ బుకింగ్‌ను ఎదుర్కొంటోంది. కొన్ని సెషన్లుగా 11850- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడుతోంది. సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ టాక్స్‌ కోతతో నిఫ్టీ ఒక్కమారుగా ర్యాలీ మూడ్‌లోకి వచ్చింది. నెలన్నరకాలంలో నిఫ్టీ 10700- 12000 పాయింట్లను

11,900 దిగువకు నిఫ్టీ

Friday 22nd November 2019

స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు... శుక్రవారం మిడ్‌సెషన్‌ కల్లా భారీగా నష్టాల్లోకి మళ్లాయి. ఐటీ రంగ షేర్ల పతనంతో పాటు సూచీల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం సూచీల పతనానికి కారణమవుతున్నాయి. అలాగే ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకానమీ కో అపరేషన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌(ఓఈసీడీ) సంస్థ ఈ ఏడాదికి దేశీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను 5.8శాతానికి డౌన్‌గ్రేడ్‌ చేయడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ట్రేడింగ్‌

Most from this category