News


రూపాయి పతనం- ఐటీ షేర్ల ర్యాలీ

Monday 1st October 2018
Markets_main1538377124.png-20750

మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సోమవారం మిడ్‌ సెషన్‌ సమయానికి ప్రధాన సూచీలన్నీ నష్టాలబాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఒక్క ఐటీ రంగ సూచీ మాత్రం భారీగా లాభపడుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఐటీ ఇందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ చేస్తోంది. ఫలితంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనపడుతోంది. రూపాయి బలహీనతతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లోని మొత్తం 10 షేర్లకు గానూ 9షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, టాటా ఎలాక్సీ షేరు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. క్రితం వారంలో ఒక్కరోజులో 70 శాతం పతనమయిన ఇన్ఫీబీమ్‌ నేటి ఇంట్రాడేలో 15శాతం లాభపడింది. టీసీఎస్‌ 4శాతం, ఇన్ఫోసిస్‌ 3.50శాతం లాభపడి సరికొత్త గరిష్టాలను నమోదు చేసి నిఫ్టీ-50 సూచిలో టాప్‌-5 గెయినర్లలో మొదటి, రెండు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. వాటితో మైండ్‌ ట్రీ, ఎన్‌ఐఐటీ టెక్‌, ఓఫ్‌ఎస్‌ఎస్‌, విప్రో షేర్లు 2శాతం లాభపడ్డాయి. అలాగే టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 1శాతం వరకు లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.12:15కు నిఫ్టీ ఇండెక్స్‌ సూచీ గతముంగింపు(15,838.05)తో పోలిస్తే 2శాతం లాభంతో 16,148.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రియల్టీ షేర్ల పతనం

Monday 1st October 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా రియల్టీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మిడ్‌సెషన్‌ సమయానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 4శాతం వరకు నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(219.60)తో పోలిస్తే 3శాతం నష్టంతో 212.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలోని భాగమైన మొత్తం 10షేర్లకు గానూ ఒక్క గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌(1శాతం లాభం) తప్ప మిగిలిన అన్ని షేర్లు పతనమయ్యాయి. అత్యధికంగా డీఎల్‌ఎఫ్‌ షేరు 9శాతం క్షీణించింది. ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌

11,171 పాయింట్లు దాటితేనే..

Monday 1st October 2018

లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు నార్నోలియా బ్రోకరేజ్‌ సూచన నిఫ్టీ ప్రస్తుతం బలమైన బేర్‌ పట్టులో ఉందని నార్నోలియా బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుతం నిఫ్టీ తన 5, 10, 20, 50 రోజుల డీఎంఏ స్థాయిలకు దిగువన ట్రేడవుతోంది. సూచీల్లో బేర్స్‌ హవాను గత మూడు రోజులుగా గ్యాప్‌అప్‌లో ఓపెనయ్యి చివర్లో భారీ పతనంతో ముగియడం సూచిస్తోంది. దేశీయ వీఐఎక్స్‌ సూచీ ప్రస్తుతం 17 స్థాయిల వద్ద ఉంది. ఈ సూచీ పెరగడం

Most from this category