News


2020లో ఐటీ స్టాక్స్‌ జోష్‌?

Friday 3rd January 2020
Markets_main1578043581.png-30651

ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌ ఆకర్షణీయంకాదు
బీమా రంగ కౌంటర్లు భేష్‌
కమోడిటీలకూ మంచి రోజులు?

బడ్జెట్‌లో మరీ ప్రతికూలమైన అంశాలు లేకుంటే..  ఆర్థికంగా సైక్లికల్‌ రికవరీని ఆశించవచ్చునంటున్నారు టీసీజీ ఏంఎసీ సీఐవో, ఎండీ చక్రీ లోకప్రియ. రానున్న ఏడాది లేదా రెండేళ్ల కాలంలో మిడ్‌ క్యాప్స్‌ ర్యాలీ నిలబడాలంటే ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

ట్రెండ్‌ మారుతోంది..
చార్టుల ప్రకారం చూస్తే.. ఇటీవల నెల రోజులుగా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ సైతం ర్యాలీ బాట పట్టాయి. ఇందుకు ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు, రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టిన ఆపరేషన్‌ ట్విస్ట్‌ వంటి చర్యలు దోహదపడుతున్నాయి. గత కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న మిడ్‌క్యాప్స్‌.. కార్పొరేట్‌ ట్యాక్స్‌లో కోతవంటి సానుకూల అంశాలతో ఇటీవల వెలుగులోకి వస్తు‍న్నాయి. చాలా కౌంటర్లు మల్టీఇయర్‌ కనిష్టాలలో ఉండటం కూడా కలసి వస్తోంది. దీంతో రిస్క్‌ ఆన్‌ ట్రేడ్‌ అనుకున్నప్పటికీ కొద్ది స్టాక్స్‌కే పరిమితమైన ర్యాలీ విస్తరించవలసి ఉంది. 

అదానీ గ్రూప్‌ స్టాక్స్‌..
గత రెండుమూడేళ్లుగా అదానీ గ్రూప్‌.. సమస్యల్లో ఉన్న పోర్టులు, యుటిలిటీ కంపెనీలను కొనుగోలు చేస్తోంది. మంచి ఆస్తులను కలిగి ఉన్న ఈ కంపెనీలు ఆర్థిక మందగమన ప్రభావాన్ని చవిచూస్తున్నాయి. వీటికి ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ సొంతం చేసుకుంటూ వచ్చింది. దీంతో ప్రస్తుతం అదానీ గ్రూప్‌ లాభాలు పెరగనప్పటికీ ఆర్థిక పురోగతి మొదలైతే.. అదానీ పోర్ట్స్‌సహా మిగిలిన కంపెనీలు మంచి పనితీరును ప్రదర్శించగలుగుతాయి.

ఆర్‌ఐఎల్‌ భేష్‌
చమురు రంగంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఓటు వేస్తాను. ఓఎన్‌జీసీ ఖరీదైన(ఎక్స్‌పెన్సివ్‌) స్టాక్‌గా భావిస్తున్నా. దీంతో 2019లో గెయిల్‌ క్షీణించినట్లే ఇటీవల ఓఎన్‌జీసీ వెనకడుగు వేస్తోంది. ఆకర్షణీయమైన ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ సమయానికి డిజిన్వెస్ట్‌మెంట్‌ జరగకపోవడంతో గెయిల్‌ మార్కెట్‌ విలువ 70 శాతం కరిగిపోయింది. ఇక ప్రస్తుతం బీపీసీఎల్‌ సైతం డిజిన్వెస్ట్‌మెంట్‌ జాబితాలో ఉంది. అయితే బీపీసీఎల్‌ను వేల్యూ బయ్‌గా భావించడంలేదు.

ఎల్‌అండ్‌టీ ఆకర్షణీయం
డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ మార్కెట్ల ర్యాలీలో పార్టిసిపేట్‌ చేయలేదు. పటిష్ట ఆర్డర్‌ బుక్‌, మెరుగైన పనితీరు ప్రదర్శించగల పరిస్థితులు కంపెనీకి ఆకర్షణను తీసుకువస్తున్నాయి. మౌలిక సదుపాయాల భారీ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో పరిశ్రమలో కొంతమేర సందేహాలున్నప్పటికీ.. ఎల్‌అండ్‌టీ స్టాక్‌ చౌకలో లభిస్తోంది. ఈ స్థాయిలలో ఎల్‌అండ్‌టీ కొనుగోలుకి ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఐటీ బ్లూచిప్స్‌ కొనొచ్చు
గతేడాది ఐటీ రంగంలో దిగ్గజాలు.. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ విభిన్న సమస్యలు ఎదుర్కొన్నాయి. దీంతో ఐటీ రంగం జోరు చూపలేకపోయింది. అయితే ఐటీకి కీలకమైన అమెరికాసహా పలు విదేశీ మార్కెట్ల నుంచి ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో 2020లో యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్ల నుంచి మంచి బిజినెస్‌ను సాధించే వీలుంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ చౌకగా లభిస్తోంది. ఇక టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ సైతం అందుబాటు స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. పటిష్ట పనితీరు సాధించే అంచనాలు, బలపడుతున్న ఆర్డర్‌ బుక్‌ వంటి అంశాల కారణంగా ఐటీ ఇండెక్స్‌ 12-15 శాతం రిటర్నులు ఇచ్చే అవకాశముంది.

కమోడిటీలు ఇలా
గతేడాది సిమెంట్‌ అమ్మకాలు పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ధరలు ఊపందుకోలేదు. ఇదే విధంగా గతేడాది ఆటోమొబైల్‌, రియల్టీ తదితర రంగాల నుంచి డిమాండ్‌ మందగించడంతో స్టీల్‌ అమ్మకాలు, ధరలలో పురోగతి కనబడలేదు. ఇకపై ఆర్థిక రికవరీ వస్తే.. ఆటోమొబైల్‌, రియల్టీ రంగాలు జోరందుకోవచ్చు. ఇది సిమెంట్‌, స్టీల్‌ తదితర రంగాలకు డిమాండ్‌ పెంచే వీలుంది.

బీమా ఓకే
దేశీయంగా బీమా రంగానికి భారీ అవకాశాలున్నాయి. దీంతో గతేడాది బీమా రంగ కంపెనీలు దూకుడు చూపాయి. అయితే ఇటీవల ప్రమోటర్ల వాటాను కుదించడంపై ఆర్‌బీఐ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వాటా విక్రయం ద్వారా సప్లై పెరిగి ఆర్‌వోఈలు నీరసించవచ్చు. అయితే ఇవి సాంకేతిక అంశాలు మాత్రమే. దీర్ఘకాలానికి బీమా రంగ ఫండమెంటల్స్‌ పటిష్టంగా కనిపిస్తున్నాయి.You may be interested

ఖాసీం మృతి.. మార్కెట్‌పై ప్రభావమెంత?

Friday 3rd January 2020

ఇరాన్‌కు చెందిన టాప్‌ మిలటరీ ఆఫీసర్‌ ఖాసీం సొలైమని అమెరికా వాయు దాడిలో మరణించడంతో మధ్యప్రాచ్యం సహా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లు ఈ పరిణామంతో ఒక్కమారుగా టెన్షన్‌ పడ్డాయి. తత్ఫలితంగా ఆసియా, యూరప్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలోకి మరలాయి. దేశీయ మార్కెట్లు కూడా ఈ ఘటన పట్ల నెగిటివ్‌గా స్పందించాయి. నిఫ్టీ ఒక దశలో కీలక 12200 పాయింట్ల దిగువకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఖాసీం మృతి

ఏడాది గరిష్టానికి జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు

Friday 3rd January 2020

 మౌలిక సదుపాయాల హైదరాబాద్‌ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో ఏడాది గరిష్టాన్ని తాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.21.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 7.60 శాతం పెరిగి రూ.23.35 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు ఏడాది గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.2:30ని.లకు 5శాతం లాభంతో 22.75 వద్ద ట్రేడ్‌

Most from this category