News


ఐటీ షేర్లు ఆకర్షణీయం!

Tuesday 17th December 2019
Markets_main1576557204.png-30268

నిపుణుల సూచన
కొత్త ఏడాది ఐటీ షేర్ల హవా కొనసాగుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ రంగంలో క్రమంగా రిస్కులు దిగివస్తున్నాయని తెలిపారు. ఈ షేర్ల సరాసరి డివిడెండ్‌ ఈల్డ్‌ బాగుండడం, సాధారణ సేవింగ్స్‌ డిపాజిట్స్‌ కన్నా అధికంగా ఉండడంతో వీటిపై ఇన్వెస్టర్లకు మక్కువ పెరుగుతోంది. బలమైన డివిడెండ్‌ ఈల్డ్‌తో పాటు వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండడం కూడా వీటిలో కొనుగోళ్లకు కారణమవుతోంది. ఈ రంగం నుంచి ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, పెరిసిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఎంఫసిస్‌, హెక్సావేర్‌ షేర్లపై అనలిస్టులు బుల్లిష్‌గా ఉన్నారు. 2019లో ప్రధాన సూచీలు దాదాపు 11 శాతం రాబడినివ్వగా నిఫ్టీ ఐటీ 6 శాతం మాత్రమే లాభాలిచ్చింది. మిడ్‌క్యాప్‌ఐటీ సూచీ 8 శాతం నష్టాన్ని మిగిల్చింది. సమీప భవిష్యత్‌లో కంపెనీల మధ్య పోటీ, ఆన్‌సైట్‌ సప్లై ఒత్తిళ్లు ఐటీ కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపవచ్చని నిపుణుల అంచనా. అయితే టీసీఎస్‌ మినహా పలు ఐటీ కంపెనీల వాల్యూషన్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది.

ఈ ఏడాది ఐటీ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా చాలా మిడ్‌క్యాప్స్‌ కరెక‌్షన్‌ చూశాయి. వృద్ధి రేటు మందగించింది. కానీ ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పు వస్తోందని నిపుణుల విశ్లేషణ. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఐటీ కంపెనీల రిస్కురివార్డు నిష్పత్తి బాగుందని అనలిస్టులు చెబుతున్నారు. సాధారణంగా యూఎస్‌ ఎన్నికల ఏడాది పెద్ద ఐటీ కంపెనీల వృద్ధి మందకొడిగా ఉంటుందని, అందువల్ల వాల్యూషన్లు దిగివచ్చిన మిడ్‌క్యాప్‌ ఐటీ షేర్లను ఎంచుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కుదిరే డీల్స్‌ను బట్టి గ్రోత్‌ అవుట్‌లుక్‌ ఉంటుందన్నారు. 



You may be interested

44,500 పాయింట్లకు సెన్సెక్స్‌!

Tuesday 17th December 2019

వచ్చే ఏడాదికి బీఎన్‌పీ టార్గెట్‌ కొత్త సంవత్సరంలో సెన్సెక్స్‌ 44,500 పాయింట్లను చేరే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం బీఎన్‌పీ పారిబా అంచనా వేసింది. ఇండియా సహా చైనా, థాయ్‌లాండ్‌, సౌత్‌కొరియా మార్కెట్లపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు తెలిపింది. ఇండోనేసియా మార్కెట్‌ను ఓవర్‌వెయిట్‌ నుంచి న్యూట్రల్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు తెలిపింది. క్రూడాయిల్‌ ధర స్థిరంగా కొనసాగుతున్నందున ముడిపదార్ధాలు చౌకగా దొరకడం తగ్గవచ్చని, పామాయిల్‌ ధరలు పెరగడం కూడా ప్రభావం చూపుతుందని అంచనా

అనిల్ అంబానీ కేసులో చైనా బ్యాంకులకు చుక్కెదురు

Tuesday 17th December 2019

680 మిలియన్ డాలర్ల క్లెయిమ్‌కు బ్రిటన్ హైకోర్టు నో న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) తీసుకున్న 680 మిలియన్ డాలర్ల కార్పొరేట్ రుణాలకు పూచీకత్తు వివాదంలో సంస్థ చైర్మన్ అనిల్ అంబానీకి ఊరట లభించింది. ఈ రుణాలను అనిల్ అంబానీ చెల్లించాలంటూ చైనా బ్యాంకులు వేసిన క్లెయిమ్ దరఖాస్తును బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. దీనికి తాను పూచీకత్తునిచ్చినట్లు తగిన సాక్ష్యాధారాలేమీ లేవని, పూర్తి విచారణ జరగకుండా చైనా బ్యాంకులు తనను ఒత్తిడి

Most from this category