News


ఐటీ...అప్‌

Tuesday 28th May 2019
Markets_main1559027571.png-25953

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ అంచనాల్ని మించి విజయం సాధించిన నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి జరుగుతున్న మార్కెట్‌ ర్యాలీలో భాగం పంచుకోని ఐటీ షేర్లు మంగళవారం జోరుగా పెరిగాయి. ఇటీవల పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరుపుతున్న ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడుల కోసం రంగాల్ని మారుస్తున్నారని, కనిష్టస్థాయి వద్ద ట్రేడవుతున్న ఐటీ షేర్లలో దృష్టి మళ్లించడమే తాజా ఐటీ షేర్ల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు వివరిస్తున్నారు. డాలరుతో రూపాయి విలువ స్వల్పంగా తగ్గి 69.65 స్థాయికి చేరడం కూడా ఈ షేర్ల పట్ల సెంటిమెంట్‌ బలపర్చింది. మధ్యాహ్నం 12.45 నిముషాలకు ప్రధాన సూచి నిఫ్టీ-50 ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1 శాతం జంప్‌చేసింది. ఈ సూచీలో భాగమైన ఇన్ఫీబీమ్‌ 5 శాతం పెరిగింది. సూచీల హెవీవెయిట్‌ షేర్లయిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు 1 శాతంపైగా పెరుగుదలతో స్థిరంగా ట్రేడవుతున్నాయి. విప్రో, టాటా ఎలక్సి, టెక్‌ మహింద్రాలు కూడా 1-2 శాతం మధ్య పెరిగాయి. You may be interested

ఇండిగో లాభం ఐదింతలు

Tuesday 28th May 2019

రూ.589 కోట్ల ఆర్జన న్యూఢిల్లీ: ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం మార్చి త్రైమాసికంలో ఐదు రెట్లు పెరిగి రూ.589 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.117 కోట్లుగానే ఉంది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.6,097 కోట్లతో పోలిస్తే, 35 శాతం వృద్ధి తో రూ.8,260 కోట్లుగా నమోదైంది. ఇక 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇండిగో లాభం అతి తక్కువగా

జాగరణ్‌ ప్రకాశన్‌ చేతికి బిగ్‌ఎఫ్‌ఎం

Tuesday 28th May 2019

రూ.1,050 కోట్లకు డీల్‌ తగ్గనున్న అనిల్‌ కంపెనీల రుణభారం ముంబై: తీవ్ర రుణ భారంతో ఇక్కట్లను ఎదుర్కొంటున్న రిలయన్స్‌ అనిల్‌ దీరూభాయి అంబానీ (అడాగ్‌) గ్రూపు అధినేత అనిల్‌ అంబానీ, ఆ భారాన్ని తగ్గించుకునే దిశగా మరో ముందడుగు వేశారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల సంస్థ రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లో తన వాటాను మరో భాగస్వామి నిప్పన్‌ లైఫ్‌కు విక్రయించేందుకు ఇప్పటికే డీల్‌ కుదుర్చుకోగా, బిగ్‌ఎఫ్‌ఎం పేరుతో దేశవ్యాప్తంగా ఎఫ్‌ఎం చానళ్లను

Most from this category