News


లాభాల బాటలో ఐటీ షేర్లు

Thursday 5th December 2019
Markets_main1575527275.png-30071

మరికొద్ది సేపట్లో ఆర్‌బీఐ పాలసీ వెలువడనున్న తరణంలో సూచీల ట్రేడింగ్‌ స్తబ్ధుగా సాగుతుంది. బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్ల ర్యాలీ సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. పాలసీ ప్రకటన అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో స్పష్టమైన కదలికలు గమనించవచ్చు. ఇక ఐటీ షేర్లు విషయానికొస్తే.., ఎన్‌ఎస్‌ఈలో ఈ ఐటీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 15,164.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇటీవల ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ మరింత పతనం ఐటీ రంగ షేర్లకు కలిసొస్తుంది. దీంతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో ఒక దశలో 15304.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(15,175.15)తో పోలిస్తే 0.75శాతం లాభంతో 15,266.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. టాటా ఎలాక్సీ 4శాతం, ఎన్‌ఐఐటీ టెక్‌ 2.50శాతం, జస్ట్‌ డయల్‌ 2శాతం, టీసీఎస్‌ 1.50శాతం, టెక్‌ మహీంద్రా 1శాతం, విప్రో అరశాతం, ఇన్పోసిస్‌ 0.10శాతం పెరిగాయి. మరోవైపు హెక్సావేర్‌ 1.20శాతం నష్టపోగా, మైండ్‌ ట్రీ షేరు 0.10శాతం నష్టపోయింది. 



You may be interested

వడ్డీరేట్లు యథాతధం

Thursday 5th December 2019

మానిటరీ పాలసీ సమీక్షా సమావేశంలో వడ్డీరేట్లను యథాతధంగా ఉంచుతున్నట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించింది. వరుసగా ఆరోమారు కూడా ఆర్‌బీఐ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలకు భిన్నంగా రేట్లను యథాతధంగా ఉంచింది. దీంతో రెపో 5.15 శాతం, రివర్స్‌ రెపో 4.90 శాతం వద్ద కొనసాగనున్నాయి. కమిటీలోని అందరు సభ్యులు ఏకగ్రీవంగా రేట్లు యథావిధిగా ఉంచేందుకు అంగీకరించారు. దీంతో పాటు వృద్ధి రేటు అంచనాను 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ

దిగివచ్చిన పసిడి

Thursday 5th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం నెలరోజుల గరిష్టం నుంచి దిగివచ్చింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో మొదటి దశ ఒప్పందం దాదాపు ఖరారయ్యానే అంశం పసిడికి దిగివచ్చేందుకు కారణవుతోంది. నేటి ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్పలాభంతో 1,481.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లభించే అవకాశాలు లేవన్న సంకేతాలతో పసిడి ధర నిన్న ఉదయం ట్రేడింగ్‌లో 1,489.85 డాలర్ల వద్ద

Most from this category