News


క్షీణించిన ఐటీ షేర్లు

Tuesday 31st December 2019
Markets_main1577788136.png-30566

ఐటీ రంగ షేర్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఎన్‌ఎన్‌ఈలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 0.78శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 15,754.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెక్ మహీంద్రా, టీసీఎస్‌, విప్రో లాంటి షేర్లు 2శాతం పతనం కారణంగా ఇంట్రాడేలో 1శాతం నష్టపోయి 15,634.50 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతమైనంది. ఇంట్రాడేలో ఈ రంగానికి చెందిన టెక్‌ మహీంద్రా 3శాతం, జస్ట్‌ డయల్‌ 2శాతం, విప్రో, టాటా ఎలాక్సీ, టీసీఎస్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే రంగానికి చెందిన హెక్సావేర్‌ షేరు 1.50శాతం వరకు లాభపడింది. మైండ్‌ ట్రీ, ఎన్‌ఐఐటీ టెక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మార్కెట్‌ ముగిసే సరికి 0.78శాతం నష్టంతో 15,652.40 వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 9.28శాతం లాభపడింది. 



You may be interested

రూ.100 లక్షల కోట్ల ఇన్‌ఫ్రా ప్రణాళిక ఇదిగో: నిర్మలా సీతారామన్‌

Tuesday 31st December 2019

మరో రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు రెడీ చేస్తాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జాతీయస్థాయిలో చేపట్టే 102 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆవిష్కరించారు. ప్రధాని పేర్కొన్న 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సాధించే దిశగా ఈ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక టాస్క్‌ఫోర్స్‌

2019కు నష్టాలతో వీడ్కోలు

Tuesday 31st December 2019

సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనం నిఫ్టీ 87 పాయింట్లు డౌన్‌ ఎదురీదిన రియల్టీ రంగం ఈ కేలండర్‌ ఏడాది(2019) చివరి రోజుకి దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో వీడ్కోలు పలికాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన మార్కెట్లు తదుపరి ఏ దశలోనూ కోలుకోలేదు. ఇన్వెస్టర్లు అమ్మకాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో చివరికి ఇంట్రాడే కనిష్టాలకు చేరువలో మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనమై 41,254 వద్ద నిలవగా.. నిఫ్టీ 87

Most from this category