News


ఇన్ఫీ జోరు: ఐటీ ఇండెక్స్‌ 2శాతం అప్‌

Monday 13th January 2020
Markets_main1578904755.png-30890

ఐటీ షేర్లకు సోమవారం కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ శుక్రవారం క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకున్నాయి. ఫలితంగా నేడు ఈ షేరు 5శాతం లాభపడింది. ఇన్ఫీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడం ఇదే రంగంలో మిగతా షేర్ల ర్యాలీకి తోడ్పాటునిచ్చింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ క్రితం టాటా ఎలాక్సీ 5శాతం పెరిగింది. ఎన్‌ఐఐటీ టెక్‌ 2శాతం, విప్రో, టెక్‌ మహీంద్రా, జస్ట్‌ డయల్‌, మైండ్‌ ట్రీ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ అరశాతం లాభపడింది. మరోవైపు ఇదే రంగానికి చెందిన మరో హెవీ వెయిటేజీ దిగ్గజం 1శాతం నష్టపోగా, హెక్సావేర్‌ అరశాతం నష్టపోయింది. మధ్యా్‌హ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(15,959.90)తో పోలిస్తే 1.50శాతం లాభంతో 16,241.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 210 పాయింట్లు పెరిగి 41,810.60 వద్ద, నిఫ్టీ 59.25 పాయింట్ల లాభంతో 12,316.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

షుగర్‌ షేర్లకు డిమాండ్‌

Monday 13th January 2020

దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాల్లో తగ్గిన చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఎఫెక్ట్‌ ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న చక్కెర తయారీ కంపెనీల కౌంటర్లు మరోసారి వెలుగులోకి వచ్చాన్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూడంతో పలు కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. చెరకు దిగుబడితోపాటు.. చక్కెర ఉత్పత్తి తగ్గిన వార్తలు కొద్ది రోజులుగా  షుగర్‌ షేర్లకు డిమాండును పెంచుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం... కారణాలేవిటంటే? ఈ సీజన్‌(అక్టోబర్‌ 2019-

టాటా కెమ్‌, టాటా గ్లోబల్‌ జూమ్‌

Monday 13th January 2020

కన్జూమర్‌ విభాగం విలీనం ఎఫెక్ట్‌ ఐదో రోజూ టాటా గ్లోబల్‌ జోరు 52 వారాల గరిష్టానికి టాటా కెమ్‌ తాజాగా టాటా కెమికల్స్‌ కంపెనీ కన్జూమర్‌ విభాగాన్ని విడదీసేందుకు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఓకే చెప్పడంతోపాటు.. గ్రూప్‌లోని మరో కంపెనీ టాటా గ్లోబల్‌ ఈ బిజినెస్‌ను విలీనం చేసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వెరసి టాటా గ్రూప్‌ కంపెనీల మధ్య బిజినెస్‌ విడతీత, విలీన ప్రతిపాదనలకు అనుమతి లభించడంతో ఇన్వెస్టర్లు ఈ రెండు

Most from this category