News


కరిగిన రూపాయి - ఐటీ షేర్లకు లాభాలు

Friday 3rd January 2020
Markets_main1578046674.png-30653

మార్కెట్‌ నష్టాల్లో ముగిసినప్పటికీ.. శుక్రవారం ఐటీ షేర్లు మాత్రం లాభాల బాట పట్టాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ నెల రోజుల కనిష్టానికి పతనం కావడం ఐటీ షేర్లకు కలిసొచ్చినట్లు విశ్లేషకులంటున్నారు. మధ్యప్రాచ్య దేశంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 3నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఫలితంగా ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ నెల రోజుల కనిష్టానికి దిగివచ్చింది. రూపాయి బలహీనతతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా నేడు ఎన్ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం లాభపడి 16,004.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 1.50శాతం లాభంతో 15,936.60 వద్ద స్థిరపడింది. ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ఎన్‌ఐఐటీ టెక్‌ షేరు 3శాతం లాభపడింది. టీసీఎస్‌ 2శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1.50శాతం పెరిగాయి. టెక్‌ మహీంద్రా,  టాటా ఎలాక్సీ, విప్రో షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. మరోవైపు ఇండెక్స్‌లోని జస్ట్‌ డయల్‌ షేరు 1.50శాతం నష్టపోగా,  హెక్సావేర్‌ షేరు అరశాతానికి పైగా క్షీణించింది. మైండ్‌ ట్రీ షేర్లు మాత్రం ఎలాంటి లాభనష్టాలకు లోనవకుండా, అక్కడిక్కడే స్థిరంగా ముగిసింది.  



You may be interested

ఇరాన్‌ టెన్షన్‌- మార్కెట్లు బోర్లా

Friday 3rd January 2020

బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో డౌన్‌ ఐటీ, ఫార్మా ఎదురీత మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసింది. అయితే విదేశీ మార్కెట్లలో ముడిచమురు, బంగారం ధరలు బలపడ్డాయి. దీంతో రూపాయి సైతం బలహీనపడగా.. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో మార్కెట్లు ఆద్యంతం నేలచూపులతోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 162 పాయింట్లు నీరసించి 41,465 వద్ద నిలవగా.. నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 12,227 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌

ఖాసీం మృతి.. మార్కెట్‌పై ప్రభావమెంత?

Friday 3rd January 2020

ఇరాన్‌కు చెందిన టాప్‌ మిలటరీ ఆఫీసర్‌ ఖాసీం సొలైమని అమెరికా వాయు దాడిలో మరణించడంతో మధ్యప్రాచ్యం సహా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లు ఈ పరిణామంతో ఒక్కమారుగా టెన్షన్‌ పడ్డాయి. తత్ఫలితంగా ఆసియా, యూరప్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలోకి మరలాయి. దేశీయ మార్కెట్లు కూడా ఈ ఘటన పట్ల నెగిటివ్‌గా స్పందించాయి. నిఫ్టీ ఒక దశలో కీలక 12200 పాయింట్ల దిగువకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఖాసీం మృతి

Most from this category