News


రాణిస్తున్న ఐటీ షేర్లు

Thursday 8th August 2019
Markets_main1565255618.png-27640

ఐటీ షేర్లు గురువారం రాణిస్తున్నాయి. ఐటీరంగంలో అదిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు ర్యాలీ, రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ ఐటీ ఇండెక్స్‌ బలపడేందుకు తోడ్పాటునందిస్తున్నాయి. నేడు ఐటీ ఇండెక్స్‌ 15,677.45 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం ర్యాలీతో పాటు హెచ్‌సీఎసీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు 6శాతం లాభపడటంతో ఇండెక్స్‌ 1.74 శాతానికి పైగా లాభపడి 15839.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యా‍హ్నం గం.2:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(15839.25)తో పోలిస్తే 1.70శాతం పెరిగి 15,853.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌(2 శాతం), హెచ్‌సీఎల్‌టెక్‌(6 శాతం)లతో పాటు ఎన్‌ఐఐటీ టెక్‌ 1.50శాతం, టెక్‌ మహీంద్రా, విప్రో, టాటా ఎలాక్సీ షేర్లు 1శాతం పెరిగాయి. మరోవైపు ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ 1శాతం నష్టపోగా, మైండ్‌ ట్రీ, ఇన్ఫోభీమ్‌ అరశాతం పెరిగింది.You may be interested

ఫలితాలు హిట్‌..అరబిందో షేరు ర్యాలీ

Thursday 8th August 2019

జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో అరబిందో ఫార్మా అన్ని పారామితులలో విశ్లేషకుల అంచనాలను అధిగమించడంతో గురువారం(అగష్టు 08) ఇంట్రాడేలో ఈ కంపెనీ షేరు 7.8 శాతం ర్యాలీ చేసింది. ఈ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన ఈ కంపెనీ 39.5 శాతం వృద్ధిని సాధించడం గమనర్హం. యుఎస్, యూరప్, యాంటీరెట్రోవైరల్ వ్యాపారాలలో గణనీయమైన వృద్ధి కారణంగా, జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ. 635.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. యుఎస్ ఫార్ములేషన్

బ్రోకరేజిల ‘బై’ సిఫార్సులు..లాభాల్లో హెచ్‌సీఎల్‌

Thursday 8th August 2019

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ క్యూ1 ఫలితాలు నిరాశపరిచినప్పటికి ఈ కంపెనీ స్టాకుపై బ్రోకరేజిలు ‘బై’ కాల్‌ను కొనసాగించడంతో హెచ్‌సీఎల్‌ షేరు విలువ గురువారం మధ్యాహ్నం 12.29 సమయానికి 4.52 శాతం లాభపడి రూ. 1,068.85 వద్ద ట్రేడవుతోంది.  ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1లో ఆపరేటింగ్‌ ఆదాయం తగ్గడంతో, కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 7.6  శాతం క్షీణించి రూ. 2,220 కోట్లుగా నమోదయ్యింది. కాగా గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ

Most from this category