News


ఎదురీదుతున్న ఐటీ షేర్లు

Wednesday 29th May 2019
Markets_main1559117129.png-25980

నష్టాల మార్కెట్లో బుధవారం ఐటీ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఇందుకు నేపథ్యం. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 15,773.30 వద్ద ప్రారంభమైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 29పైసలు బలహీనపడింది. డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు ఈ అంశం కలిసొస్తుందన్న ఐటీ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఫలితంగా ఐటీ ఇండెక్స్‌ 1.50శాతం ర్యాలీ చేసి 15973.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. టీసీఎస్‌, విప్రో, ఎన్‌ఐఐటీటెక్‌ హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. టాటాఎలాక్సీ, టెక్‌మహీంద్రా, మైండ్‌ట్రీ షేర్లు 1నుంచి అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇన్ఫీభీమ్‌ ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.1:00లకు ఇం‍డెక్స్‌ గతముగింపు(15,762.05)తో పోలిస్తే 1శాతం లాభంతో 15,913.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి  ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 160 పాయింట్లు నష్టపోయి 39,589 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లను కోల్పోయి 11,879 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.50శాతం డౌన్‌

Wednesday 29th May 2019

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నష్టాల మార్కెట్లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీ అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌  5శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ 3శాతం, అలహబాద్‌ 2.50శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ షేర్లు 2శాతం పతనమయ్యాయి.

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Wednesday 29th May 2019

పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ లాభానికి భారీ గండి హైదరాబాద్‌, బిజినెస్‌బ్యూరో: విలువ ఆధారిత ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల కంపెనీ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సగం మేర తరిగిపోయింది. రూ.585 కోట్ల ఆదాయంపై రూ.24 కోట్ల లాభాన్ని నమోదు చేయగా, షేరువారీ ఆర్జన రూ.1.59గా ఉంది. అంతక్రితం ఏడాది (2017-18) మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.503

Most from this category