News


అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు

Tuesday 13th August 2019
Markets_main1565687911.png-27739

రూపాయి బలహీనపడినప్పటికీ.., మం‍గళవారం ఐటీ షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం పతనమైంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్ల పతనం 2శాతం వరకు క్షీణించడం ఇతర ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. నేడు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 15,809 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఐటీ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఫలితంగా ఇండెక్స్‌ ఒకదశలో 2శాతం వరకు క్షీణించి 15506.90 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(15,821.35)తో పోలిస్తే 15,528.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా మైండ్‌ ట్రీ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోభీమ్‌ షేర్లు 3.50శాతం పతనమయ్యాయి. అలాగే టాటా ఎలాక్సీ షేర్లు 3శాతం క్షీణంచాయి. ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు 2.50శాతం, ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం, విప్రో, టీసీఎస్‌ షేర్లు 1.50శాతం నష్టపోయాయి. అలాగే ఎన్‌ఐఐటీటెక్‌ షేర్లు 1శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం...భారీ పతనం

Tuesday 13th August 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లిమిడెట్‌ షేర్లు 5శాతం క్షీణించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 3శాతం నష్టపోయాయి. ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజి కలిగిన ఈ ద్వయం పతనంతో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు భారీగా పాయింట్లను కోల్పోయాయి. నేడు నిఫ్టీ కోల్పోయిన 183.55 పాయింట్లలో ఈ రెండు షేర్లవే 75 పాయింట్లు కావడం విశేషం. హెచ్‌డీఎఫ్‌సీ :- నేడు బీఎస్‌ఈలో రూ.2166.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

డిస్కౌంట్‌లో 32 నిఫ్టీ షేర్లు

Tuesday 13th August 2019

మార్కెట్లు పతనం కారణంగా చాలా వరకు టాప్‌ కంపెనీల స్టాకుల వాల్యుషన్‌ తగ్గింది. దీర్ఘకాల వాల్యుషన్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ స్టాకులు డిస్కౌంట్‌తో  ట్రేడవుతున్నాయి. నీఫ్టీ 50 ఇండెక్స్‌లోని సగానికి పైగా స్టాకులు వాటి పదేళ్ల పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్స్‌) నిష్పత్తి సగటుతో పోల్చుకుంటే రాయితీతో ట్రేడవుతున్నాయి. పదేళ్ల పీబీ(ప్రైస్‌ టూ బుక్‌) నిష్పత్తి సగటుతో పోల్చుకుంటే నిఫ్టీ 50లోని 32 స్టాకులు ప్రస్తుతం డిస్కౌంట్‌తో ట్రేడవుతుండడం గమనార్హం.  అయినప్పటికి

Most from this category