News


నష్టాల మార్కెట్లో ఐటీ షేర్ల ర్యాలీ..!

Friday 4th October 2019
Markets_main1570183680.png-28722

ఆర్‌బీఐ జీడీపీ అంచనాల్ని 6.1 శాతానికి తగ్గించడంతో మార్క్‌ట్‌లో విపరీతమైన అమ్మకాలు జరుగుతున్పటికీ.., ఐటీ షేర్లకు మాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 15,328.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ ఐటీ షేర్లకు డిమాండ్‌ను పెంచింది. ఫలితంగా డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు లాభాల బాట పట్టాయి. ఐటీ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో టెక్‌ మహీంద్రా లాంటి అధిక వెయిటేజీ కలిగిన షేర్లు 1శాతం లాభపడంతో ఇండెక్స్‌ ఒక దశలో 1శాతం వరకు పెరిగి 15,418.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.3:20ని.లకు ఇండెక్స్‌ క్రితం​ముగింపు (15418.80)తో పోలిస్తే అరశాతం లాభంతో 15,350 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

సెన్సెక్స్‌ నష్టం 433 పాయింట్లు

Friday 4th October 2019

ఆర్థిక మందగమన భయాలతో ఆర్‌బీఐ జీడీపీ వృద్ధి అంచనాల్ని భారీ సవరించడంతో శుక్రవారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 433 పాయింట్లు నష్టపోయి 38000 దిగువున 37,673.31 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 139 పాయింట్లను కోల్పోయి 11200 దిగువున 11,174.75 వద్ద ముగిసింది. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు విపరీతంగా జరిగాయి. ముఖ్యంగా వడ్డీరేట్లకు ప్రభావితమయ్యే బ్యాంకింగ్‌, అటో, రియల్టీ షేర్లు తీవ్ర ఒడిదుకుడులకు

మరో రేట్‌ కట్‌...విశ్లేషకుల అంచనా

Friday 4th October 2019

 రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం ఎంపీసీ(మానిటరీ పాలసీ కమిటీ) సమావేశంలో మరోదపా 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించి రెపోరేటును 5.15 శాతానికి పరిమితం చేసింది. ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన దేశ జీడీపీని తిరిగి పుంజుకునేలా చేసేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను 6.1 శాతానికి తగ్గించింది.  దీనిని చేరుకునేందుకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచి మరో 15

Most from this category