News


ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Monday 16th December 2019
Markets_main1576471894.png-30245

ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఐటీ షేర్ల మద్దతుతోనే సెన్సెక్స్‌ ఇండెక్స్‌ కొత్త ఆల్‌టైం హైని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 15,263.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. స్టాక్‌ మార్కెట్‌ ప్రభావానికి ముందు ఫారెక్స్‌ మార్కెట్లో నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ముగింపు(70.81)తో పోలిస్తే 6పైసల బలపడి 70.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఐటీరంగానికి చెందిన మైండ్‌ ట్రీ 2శాతం, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు 1.500శాతం లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ ఎన్‌ఐఐటీటెక్‌ షేర్లు 1శాతం పెరిగాయి. ఇన్ఫోసిస్‌, హెక్సావేర్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. జస్ట్‌ డయల్‌ 0.10శాతం స్వల్పంగా లాభపడింది. ఒక్క టాటా ఎలాక్సీ​ షేరు మాత్రం 0.17శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నిప్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం గం.10:00లకు 1.13శాతం లాభంతో 15,372.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

నిఫ్టీలో లాంగ్‌ కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం!

Monday 16th December 2019

నిపుణుల సలహా నిఫ్టీ షార్ట్‌టర్మ్‌కు బలంగా కనిపిస్తోందని ప్రముఖ అనలిస్టు శుభం అగర్వాల్‌ చెప్పారు. కీలక 12వేల వద్ద పుట్‌రైటింగ్‌ ఎక్కువగా ఉందన్నారు. పైస్థాయిలో పెద్దగా చెప్పుకోదగ్గ ఆటంకాలేవీ లేవని అభిప్రాయపడ్డారు. నిఫ్టీలాంటి నిర్మాణమే బ్యాంకు నిఫ్టీలో 32వేల పాయింట్ల వద్ద కనిపిస్తోందన​ఆనరు. వీఐఎక్స్‌ సైతం 13 స్థాయిల వద్ద ఉండడం స్వల్పకాలిక బుల్లిష్‌నెస్‌కు సంకేతంగా చెప్పారు. ఈ సమయంలో లాంగ్‌ కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించడం ఉత్తమమని సలహా ఇచ్చారు.  వ్యూహం.. 12100

ఈవారంలో 12200పాయింట్లకు నిఫ్టీ!

Monday 16th December 2019

నిపుణుల అంచనా నిఫ్టీ వీక్లీ చార్టుల్లో లోయర్‌ షాడోతో కూడిన పొడవైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ పాట్రన్‌ ఏర్పడిన అనంతరం వెంటనే ఈ బుల్లిష్‌ కాండిల్‌ ఏర్పడడం పాజిటివ్‌ సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ఫార్మేషన్‌ స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌కు సంకేతంగా చెబుతున్నారు. నిఫ్టీ 12158 పాయింట్లపైన స్థిరంగా కొనసాగితే నెగిటివ్‌ లక్షణాలు పోతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ వారం నిఫ్టీ 12150- 12200 పాయింట్లను చేరవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు

Most from this category