News


ఐటీ షేర్లకు ‘‘ఇన్ఫీ’’ దెబ్బ

Tuesday 22nd October 2019
Markets_main1571736920.png-29057

ఇన్ఫోసిన్‌ నష్టాల సెగలు తన సహచర ఐటీ షేర్లను తాకాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ దాదాపు శాతం నష్టపోయింది. కంపెనీ యాజమాన్యం ఆదాయం, లాభాలను పెంచి చూపుతందని విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదుతో నేడు ఇన్ఫోసిస్‌ షేర్లు 16శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఇన్ఫీ షేర్ల భారీ పతనంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 4.75 శాతం క్షీణించి 14,685.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యా్‌హ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(15410.10)తో పోలిస్తే 4.70శాతం నష్టంతో 14,684.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇదే ఐటీ ఇండెక్స్‌లోని హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.30శాతం, టెక్‌ మహీంద్రా 2.50శాతం, హెక్సావేర్‌ 2శాతం, జస్ట్‌ డయల్‌, టాటా ఎలాక్సీ 1.50శాతం, మైండ్‌ ట్రీ, టీసీఎస్‌ షేర్లు అరశాతం వరకు నష్టపోయాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని విప్రో షేర్లు 1.65శాతం, ఎన్‌ఐఐటీ టెక్‌ షేర్లు 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. You may be interested

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గరిష్ట స్థాయి నుంచి పతనం

Tuesday 22nd October 2019

బ్రోకరేజ్‌ సంస్థల రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 9శాతం ర్యాలీ చేసిన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.239.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కేర్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ ధీర్ఘకాలిక రుణ రేటింగ్‌ను కేర్‌ ఎఎ(+)గానూ, స్వల్పకాలిక రుణ రేటింగ్‌ను కేర్‌ ఎఎగానూ అప్‌గ్రేడ్‌ చేసింది. బ్రిక్స్‌ రేటింగ్‌ సంస్థ సైతం కంపెనీ

త్వరలో ఆదాయపు పన్ను చెల్లింపుదార్లకు శుభవార్త?

Tuesday 22nd October 2019

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తరహాలో త్వరలో ప్రకటన వెలువడే అవకాశాలు పన్ను స్లాబుల మార్పునకు కమిటీ సిఫార్సులు దీపావళి సమయానికి ప్రభుత్వ ప్రకటన ఉండొచ్చన్న అంచనాలు గత నెల కార్పొరేట్‌ పన్నును ప్రభుత్వం తగ్గించగానే, కార్పొరేట్‌ రంగానికి ముందస్తు దీపావళి వచ్చిందని అందరూ అభివర్ణించారు. నిజమైన దీపావళి మరికొద్ది రోజుల్లో ఉండగా ఈ దఫా వ్యక్తిగత ఆదాయపన్నుచెల్లింపుదారులకు కూడా ప్రభుత్వం అలాంటి బహుమానం ఇస్తుందన్న అంచనాలు పెరిగాయి. పలువురు ఆర్థికవేత్తలు కూడా వ్యక్తిగత ఆదాయపన్ను

Most from this category