News


లాభాల మార్కెట్లో ఐటీ షేర్ల డీలా..!

Monday 23rd September 2019
Markets_main1569216956.png-28491

రూపాయి బలపడటంతో లాభాల మార్కెట్లో ఐటీ షేర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఐటీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం సెషన్‌లో దాదాపు 5శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 15,611.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ నష్టంతో ప్రారంభమైనప్పటికీ.., తిరిగి లాభాల్లోకి మళ్లింది. ఫలితంగా డాలర్ల రూపాయి ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీల షేర్లు షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో ఇండెక్స్‌ 5శాతం నష్టపోయి 14,735.55 వద్ద ఇంట్రాడే వద్ద కనిష్టస్థాయిని తాకింది. మార్కెట్‌ ప్రారంభంలో కోల్పోయిన నష్టాల్ని కొంత రికవరి చేసుకోవడంతో ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(15,491.05)తో పోలిస్తే 2.60శాతం నష్టంతో 15,089.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇం‍డెక్స్‌లో ప్రధాన షేర్లైన ఇన్ఫోసిస్‌ షేర్లు అత్యధికంగా 3.66శాతం నష్టపోయాయి. ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ షేర్లు 3.50శాతం, టీసీఎస్‌ షేర్లు 2.50శాతం, టెక్‌ మహీంద్రా, విప్రో షేర్లు 2శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా ఎలాక్సీ షేర్లు 1.50శాతం నష్టపోయాయి. వాటితో ఇన్ఫీభీమ్‌, ఎన్‌ఐఐటెక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మైండ్‌ ట్రీ షేర్లు మాత్రం 0.20శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

స్థిరంగా పసిడి

Monday 23rd September 2019

పసిడి ధర సోమవారం స్థిరంగా కదులుతుంది. నేడు ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల లాభంతో 1,527 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ఉద్రికత్తలు పసిడి ర్యాలీకి మద్దతినిస్తున్నాయి. అలాగే అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలపై సరైన స్పష్టత కొరుకు ఎదురుచూస్తున్నారు. పసిడి ప్రస్తుతం మిశ్రమ జోన్‌లో ఉందని ఓసీబీసీ బ్యాంక్‌ ఆర్థికవేత్త హవాయి లీ అభిప్రాయపడ్డారు. సౌది అరేబియాలో ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య చర్చల్లో భాగంగా గతవారాంతంలో అమెరికా

ఆల్‌టైం గరిష్ఠానికి ఐసీఐసీఐ బ్యాంక్‌

Monday 23rd September 2019

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు భారీస్థాయిలో లాభపడి ట్రేడవుతున్నాయి. ఈ చర్య వలన బ్యాంకింగ్‌ సెక్టార్‌ షేర్లు గత సెషన్‌ నుంచి పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో 30,000 మార్కును అధిగిమించడం గమనార్హం. పాజిటివ్‌ మార్కెట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. ఈ బ్యాంక్‌ షేరు సోమవారం ఉదయం 10.58 సమయానికి  6.91 శాతం

Most from this category