News


లాభాల్లోంచి నష్టాల్లోకి ఐటీ షేర్లు..!

Monday 3rd February 2020
Markets_main1580719688.png-31468

ఐటీ షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాల్లో ట్రేడైనప్పటికీ.. మిడ్‌ సెషన్‌ కల్లా తిరిగి నష్టాల్లోకి మళ్లాయి. కేంద్ర బడ్జెట్‌ 2020లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 34 పైసలు బలహీనతతో ప్రారంభం కావడంతో ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ దాదాపు ఒకశాతం వరకు పెరిగింది. అనంతరం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, రూపాయి రీవకరీతో ఇండెక్స్‌ తిరిగి నష్టాల్లోకి మళ్లింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు(16,282.65)తో పోలిస్తే 1.21శాతం నష్టంతో 16,085.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి అత్యధికంగా జస్ట్‌ డయల్‌ షేర్లు 8శాతం నష్టపోయింది. టీసీఎస్‌ షేరు 3శాతం, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా షేరు 1.50శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెక్సావేర్‌, మైండ్‌ ట్రీ, టాటా ఎలాక్సీ షేర్లు 2.50శాతం లాభపడ్డాయి. విప్రో, ఎన్‌ఐఐటీ షేర్లు అరశాతం పెరిగాయి. 
ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 77పాయింట్లు లాభంతో 39,812.90 వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 11,682.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

డీడీటీ ట్యాక్స్ తొలగింపుపై మిశ్రమ స్పందన లభిస్తోంది. డీడీటీ ట్యాక్స్‌ను ఇన్వెస్టర్లకు బదలాయిండచం వల్ల దేశీ ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. డివిడెండ్ తీసుకున్నవారు వారి పన్ను స్లాబ్‌కు అనుగుణంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇండియన్ ఆయిల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, హిందుస్తాన్ జింక్, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంత, ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఎక్కువ డివిడెండ్లు చెల్లిస్తూ ఉంటాయి.  



You may be interested

కోల్‌ ఇండియా అప్‌

Monday 3rd February 2020

ఉత్పత్తి పెరగడంతో  సోమవారం  కోల్‌ ఇండియా షేరు లాభపడింది. వార్షిక ప్రాతిపదికన జనవరిలో ఉత్పత్తి 10.3 శాతం పెరిగి 63.11 మిలియన్‌టన్నులకు చేరిందని కంపెనీ ప్రకటించింది. 2019 జనవరిలో 57.21 మిలియన్ల టన్నుల ఉత్పత్తి నమోదైంది. దీంతో  మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 1 శాతం లాభంతో రూ. 111వద్ద షేరు ట్రేడ్‌ అవుతోంది. వార్షిక   ప్రాతిపదికన  జనవరిలో కోల్‌ అమ్మకాలు 6.9 శాతం పెరిగి 52.44 మిలియన్‌

ఈ 40 షేర్లకు బడ్జెట్‌ బూస్ట్‌!

Monday 3rd February 2020

బడ్జెట్‌లో సానుకూల ప్రతిపాదనల ఎఫెక్ట్‌ జాబితాలో ఐటీ, ఫుట్‌వేర్‌ తదితర రంగాలు ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ రంగ షేర్లకూ లబ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పలువురు నిరాశపడినప్పటికీ.. కొన్ని రంగాలకు మేలు జరగనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆయా రంగాలలోని కంపెనీలకు లబ్ది చేకూరే వీలున్నట్లు విశ్లేషిస్తున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలతో ఏఏ రంగాలు, కంపెనీలపై సానుకూల ప్రభావం పడనుందన్న అంచనాల వివరాలు చూద్దాం.. ఎల్‌టీసీజీ ప్రస్తావనలేదు.. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా బడ్జెట్‌ వెలువడలేదని

Most from this category