News


రూపాయి క్షీణత: రాణిస్తున్న ఐటీ షేర్లు

Wednesday 30th October 2019
Markets_main1572420522.png-29233

రూపాయి బలహీన ట్రేడింగ్‌తో బుధవారం ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎన్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 1.50శాతం వరకు లాభపడింది. నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపు(70.84)తో పోలిస్తే 13 పైసలు నష్టపోయింది. రూపీ బలహీనపడటం డాలర్ల​రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఈ రంగంలో ప్రధాన షేర్లైన ఇన్ఫోసిస్‌ 2.50శాతం లాభపడగా, టీసీఎస్ 2శాతం పెరిగింది. ఎన్‌ఐఐటీ టెక్‌, టాటా ఎలాక్సీ, హెక్సావేర్‌ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం ర్యాలీ చేశాయి. అలాగే హెచ్‌సీఎల్ టెక్‌, విప్రో, జస్ట్‌డయల్‌ షేర్లు అరశాతం పెరిగాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో టెక్‌ మహీంద్రా, మైండ్‌ ట్రీ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం వరకు నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:30లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ క్రితం ముగింపు స్థాయి(15,181.40) నుంచి 1.30శాతం లాభపడి 15,377 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

మార్కెట్‌ ట్రెండ్‌ మారింది: దీపన్‌ మెహతా

Wednesday 30th October 2019

‘స్టాక్‌మార్కెట్లు ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సూచీలు. స్టాకుల ధరలు పెరుగుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దగ్గర్లో ఉందని అర్ధం’ అని ఎలిక్షిర్‌ ఈక్విటీస్‌ వ్యవస్థాపకుడు, డెరక్టర్‌ దీపన్‌ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. షేర్ల పెరుగుదల-ఆర్థిక వ్యవస్థ.. ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంగా స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు పనిచేస్తాయి. ఒకవేళ స్టాక్‌ ధరలు పెరుగుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సిద్ధంగా ఉందనే అర్థం. వ్యవస్థలో అనేక సైకిల్స్‌

30,000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 30th October 2019

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,000 పైన ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు వరుసగా రెండో రోజూ లాభాలతో 30,005.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ 244 పాయింట్ల(0.85శాతం) వరకు లాభపడి 30117.20 వద్ద

Most from this category