News


నష్టాల మార్కెట్లో... ఐటీ షేర్ల ర్యాలీ

Tuesday 24th September 2019
Markets_main1569314769.png-28518

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి. గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లలో భారీ పతనాన్ని చవిచూసిన ఐటీ షేర్లు మంగళవారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 2.50శాతం పెరిగింది. ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగి ఇన్ఫోసిస్‌ షేర్ల 3.50శాతం పెరగడం ఇండెక్స్‌ ర్యాలీకి తోడ్పడింది.గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ క్రిడెట్‌ శాచ్స్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ షేర్లపై అండర్‌ఫెర్మ్‌ఫామింగ్‌ రేటింగ్‌ కొనసాగించడంతో పాటు షేర్ల కొనుగోళ్ల ధరను రూ.670లు నుంచి రూ.690లకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఇన్ఫోసిస్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 3.50శాతం పెరిగి రూ.789.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. లార్జ్‌ వెర్టికల్స్‌, బేస్‌ ఎఫెక్ట్‌లు సరళత్వంతో ఈ రెండోత్రైమాసికంలో కంపెనీ ఫలితాలు బలహీనంగా ఉంటాయని రీసెర్చ్‌ సంస్థ అంచనా వేస్తుంది. ‘‘తొలి త్రైమాసికలో 12శాతంగా నమోదైన ఆర్గానిక్‌ ఆదాయ వృద్ధి నాలుగో క్వార్టర్‌ నాటికి 8శాతానికి పరిమితం కావచ్చు. అయితే స్వల్పకాలికంలో ఫారెక్స్‌ ప్రతికూలంగా మారవచ్చు. టీసీఎస్‌తో ఇన్ఫోసిస్‌ ప్రసుత్తం 10శాతం డిస్కౌంట్‌తో ఉంది. రానున్న రోజుల్లో ఇది 15-20శాతం విస్తరించవచ్చు’’ అని రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. ఇన్ఫోసిస్‌తో పాటు ఇదే ఇండెక్స్‌లోని టాటా ఎలాక్సీ 7శాతం ర్యాలీ చేసింది. టెక్‌ మహీంద్రా 3శాతం, హెచ్‌సీఎల్‌టెక్‌ 2శాతం, టీసీఎస్‌ 1.50శాతం, విప్రో 1శాతం, ఎన్‌ఐఐటెక్‌ షేర్లు అరశాతం పెరిగాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ అత్యధికంగా 1.50శాతం నష్టపోయింది. మైండ్‌ ట్రీ, ఇన్ఫీభీమ్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.1:50ని.లకు ఇండెక్స్‌ క్రితం‍ ముగింపు(15,040.65)తో పోలిస్తే 1.75శాతం లాభంతో 15,306.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 



You may be interested

డిజిన్వెస్ట్‌మెంట్‌ అంచనాలతో మరింత పెరిగిన బీపీసీఎల్‌

Tuesday 24th September 2019

కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం వలన ప్రభుత్వం ద్రవ్యలోటు ఒత్తిళ్లను ఎదుర్కొవలసి ఉంటుంది. ఈ ఒత్తిళ్లను ఎదుర్కోడానికి ప్రభుత్వం, ప్రభుత్వరంగ యూనిట్ల నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటుందని అంచనాలు మార్కెట్‌ వర్గాలలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపీతే మొదట ప్రభుత్వం రంగం సంస్థయిన భారత పెట్రోలియం కార్పోరేషన్‌(బీపీసీఎల్‌)లో జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా గత మూడు సెషన్‌ల నుంచి బీపీసీఎల్‌ షేరు ర్యాలీ చేస్తోంది.

గరిష్టస్థాయి నుంచి బ్యాంక్‌ నిఫ్టీ 2.5 శాతం పతనం

Tuesday 24th September 2019

ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం మేర క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 30,432.00 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ఆరంభంలో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 102 పాయింట్లు పెరిగి 30,668.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అనంతర జరిగిన లాభాల స్వీకరణతో ఇంట్రాడే గరిష్టం(30,668) నుంచి 2.50శాతం క్షీణించి 29,889.55 వద్ద ఇంట్రాడే

Most from this category