News


రూపాయి ర్యాలీతో నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 26th December 2018
Markets_main1545803716.png-23238

డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో బుధవారం ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ పతనం, అమెరికాలో రాజకీయ అస్థితరతో డాలర్‌ ఇండెక్స్ 4నెలల కనిష్టానికి పతనం కావడంతో నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 39 పైసలు బలపడింది. రూపాయి ర్యాలీతో డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు కష్టాలు మొదలయ్యాయి. రూపీ ర్యాలీ కారణంగా  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ దాదాపు 2శాతం నష్టపోయి 14,018.45 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ గతముగింపు(14,247.75)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో  14,069.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో అత్యధికంగా ఇన్ఫీభీమ్‌ 4.50శాతం నష్టపోయింది. ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ 3శాతం, టీసీఎల్‌ 2శాతం, టెక్‌ మహీంద్రా 1.50శాతం, ఇన్ఫోసిస్‌, టాటా ఎలాక్సీ, విప్రో, మైండ్‌ ట్రీ షేర్లు 1శాతం క్షీణించాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని ఎన్‌ఐఐటీటెక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ అరశాతం లాభంతో స్వల్పంగా లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

వచ్చే ఏడాది పసిడిదే: నిర్మల్‌ బంగ్‌

Wednesday 26th December 2018

వచ్చే ఏడాది కచ్చితంగా బులియన్‌ మార్కెట్‌దేనని నిర్మల్‌ బంగ్‌ కమోడిటీ రీసెర్చ్‌ హెడ్‌ కునాల్‌ సాహా అభిప్రాయపడుతున్నారు. పసిడిని అధికంగా వినియోగించే చైనా, ఇండియాల నుంచి నుంచి పసిడికి డిమాండ్‌ తగ్గడం, అమెరికా వడ్డీరేట్ల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించడంతో ఈ ఏడాదిలో బులియన్‌ ర్యాలీ చాలా నెమ్మదిగా జరిగిందని ఆయన తెలిపారు. అలాగే వచ్చే ఏడాది(2019)లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై ఎలాంటి వైఖరీకి కట్టుబడి ఉంటుందో ఎవరికీ తెలియదని, అమెరికా

మరింత బలపడిన పసిడి

Wednesday 26th December 2018

గత ట్రేడింగ్‌లో 6నెలల గరిష్టం వద్ద ముగిసిన పసిడి ధర బుధవారం ట్రేడింగ్‌లో మరింత బలపడింది. అమెరికాలో నెలకొన్న రాజకీయ అస్థితర, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు పసిడి ర్యాలీకి మద్దతనిస్తున్నాయి. ‍ప్రపంచమార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో నేడు ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌తో పాటు, పసిడి ధరపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ సైతం 4నెలల కనిష్టం వద్ద స్తబ్దుగా ట్రేడ్‌ అవుతుండటం పసిడికి మరింత ఉత్సాహానిస్తుంది.

Most from this category