News


రూపీ ర్యాలీ: భారీ నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 14th November 2018
Markets_main1542177577.png-21992

డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటంతో ఐటీ షేర్లు నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల భారీ పతనం కారణంగా రానున్న రోజుల్లో క్యాడ్‌ తగ్గుతుందనే అంచనాలతో నేడు దేశీ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండు నెలల గరిష్టాన్ని అందుకుంది. రూపాయి బలపడటంతో డాలర్‌ మారకంలో ఆదాయాల్ని ఆర్జించే పలు ఐటీ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(14698.20)తో పోలిస్తే 2.75శాతం నష్టంతో ఎన్‌ఎస్‌ఈలో అన్ని ఇండెక్స్‌ల్లోకెల్లా అత్యధికంగా నష్టపోయింది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లకు గానూ అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా టెక్‌ మహీంద్రా 4శాతం నష్టపోయింది. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌ఐఐటీ టెక్‌, టీసీఎస్‌ షేర్లు 3శాతం నష్టపోయాయి. టాటాఎలాక్సీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, విప్రో షేర్లు 2నుంచి 1శాతం క్షీణించాయి. మెండ్‌ ట్రీ, ఇన్ఫీభీమ్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. ఇదే సమయానికి ఈ సూచీలో ప్రధాన షేర్లైన టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో చోటు దక్కించుకున్నాయి.



You may be interested

భారత్‌పై పాజిటివ్‌..

Wednesday 14th November 2018

భారత్‌పై సానుకూల అంచనాలతోనే ఉన్నామని, ఇన్వెస్ట్‌మెంట్‌ అలొకేషన్‌లో ఎలాంటి మార్పులు లేవని సీఎల్‌ఎస్‌ఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌ తెలిపారు. ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానాలను అనుసరించడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తంచేయడం సముచితమేనని అభిప్రాయపడ్డారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ఆర్‌బీఐ సరళ ద్రవ్య విధానాలను అనుసరించొచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పదికి ఎనిమిది మార్క్‌లు వేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది గొప్ప మార్కులు ఏమీ కాదని, ప్రభుత్వం

టాటా స్టీల్‌ను మెచ్చిన అనలిస్టులు

Wednesday 14th November 2018

‘బై రేటింగ్‌’ కొనసాగించిన సీఎల్‌ఎస్‌ఏ ‘అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌’ ఇచ్చిన మాక్వైరీ ముంబై:  ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో టాటా స్టీల్‌ లిమిటెడ్‌ షేరు ధర బుధవారం 4 శాతం మేర లాభపడింది. ఇంట్రాడేలో రూ.610.60 గరిష్టస్థాయిని తాకింది. క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో కంపెనీ నికర లాభం రూ.3,116 కోట్లుగా నమోదైనట్లు మంగళవారం టాటా స్టీల్‌ బోర్డ్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఏడాది ప్రాతిపదికన 269 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు

Most from this category