లాభాల్లో ఒరాకిల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు
By Sakshi

దేశియ కరెన్సీ డాలర్ మారకంలో 8 నెలల కనిష్ఠానికి పడిపోవడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఉదయం 11.50 సమయానికి 1.14 శాతం లాభపడి 15,810.65 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్ షేర్లయిన ఒరాకిల్ (ఓఎఫ్ఎస్ఎస్) 3.20 శాతం లాభపడి రూ. 3,002.00 వద్ద, టీసీఎస్ 1.33 శాతం లాభపడి రూ. 2,245.45 వద్ద, ఇన్ఫోసిస్ 0.75 శాతం లాభపడి రూ. 801.65 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో టాటా ఎలక్సిసీ 2.39 శాతం, మైండ్ ట్రీ 1.54 శాతం, టెక్ మహింద్రా 1.11 శాతం, విప్రో 1.01 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.81 శాతం, నిట్ టెక్ 0.47 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఇన్ఫీ బీమ్ మాత్రం ఎటువంటి మార్పులేకుండా ఉంది.
You may be interested
మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
Friday 23rd August 20192.50శాతం ర్యాలీ చేసిన నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఇటీవల బాగా క్షీణించిన మెటల్ షేర్లు శుక్రవారం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. వేదాంత, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, సెయిల్, కోల్ ఇండియా షేర్ల ర్యాలీ ఇండెక్స్ లాభపడేందుకు తోడ్పడింది. నేడు ఈ ఇండెక్స్ 2,191.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభమైంది. అంతర్జాతీయ వృద్ధి మందగమనం, ట్రేడ్‌వార్‌తో గతకొంతకాలంగా భారీగా పతనమైన మెటల్
త్వరలో ఐఆర్సీటీసీ ఐపీఓ
Friday 23rd August 2019ఇష్యూ సైజు రూ.500-600 కోట్లు న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. రైల్వేలకు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే ఐపీఓ ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల దాదాపు 2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. ఈ ఐపీఓ సైజు రూ.500-600 కోట్ల రేంజ్లో