News


రూపాయి డీలా : ఐటీ ర్యాలీ

Monday 12th November 2018
Markets_main1542003754.png-21896

డాలర్‌ మారకంలో రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసి వస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం ర్యాలీ చేసింది. డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా నేడు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనపడింది. ఫలితంగా డాలర్‌ రూపంలో ఆదాయాల్ని ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లు లాభాల ర్యాలీ చేస్తున్నాయి. నేటి ఇంట్రాడేలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ చేసి 14821.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (14,553.25)తో పోలిస్తే 1.71శాతం లాభంతో 14,801.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లలో 6 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 4 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా టెక్‌మహీంద్రా ఇండెక్స్‌ 3శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. ఇన్ఫోసిస్‌ 2.50శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2శాతం, టీసీఎస్‌ 1.50శాతం, మైండ్‌ ట్రీ 1శాతం, నీట్ టెక్‌ అరశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు ఇదే సూచీలోని ఇన్ఫీభీమ్‌ అ‍త్యధికంగా 4శాతం నష్టపోయింది. టాటా ఎలక్సీ 2శాతం, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌, విప్రో షేర్లు అరశాతం నష్టపోయాయి.You may be interested

ఈ షేర్లను పడ్డప్పుడల్లా కొనండి..

Monday 12th November 2018

నిఫ్టీ ఇండెక్స్‌ తన బలమైన మద్దతు స్థాయి 10,000 మార్క్‌ నుంచి బౌన్స్‌బ్యాక్‌ అయ్యిందని ఎల్‌కేపీ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రోహిత్‌ సింగ్రే తెలిపారు. డైలీ చార్ట్స్‌లో పాజిటివ్‌ డైవర్జెన్స్‌ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రివర్సల్‌కు ఇది ఒక సంకేతమని తెలిపారు. ఇండెక్స్‌ తన 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌కు దిగువున ట్రేడ్‌ అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది బలమైన నిరోధ స్థాయి 10,600- 10,700 జోన్‌ దిగువున కదలాడుతోందని తెలిపారు.

మార్కెట్ల యూటర్న్‌

Monday 12th November 2018

10,600 మార్క్‌ దిగువున నిఫ్టీ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11:11 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 35,129 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 10,583 వద్ద ట్రేడవుతున్నాయి.  నిఫ్టీ-50లో టెక్‌ మహీంద్రా, టైటాన్‌ షేర్లు 3 శాతానికిపైగా పెరిగాయి. ఇక ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 2

Most from this category