News


టీసీఎస్‌, ఇన్ఫీ అప్‌

Thursday 13th February 2020
news_main1581573776.png-31754

నష్టాల మార్కెట్లోనూ గురువారం  ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లోనే అరశాతం లాభపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పుంజుకోవడంతో దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనపడింది. డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు ఈ అంశం కలిసొచ్చింది.  దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఐటీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఒక దశలో ఐటీ ఇండెక్స్‌ అరశాతం లాభపడి 16608.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం 11గంటలకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు(16,538.10)తో పోలిస్తే 0.30శాతం లాభంతో 16590.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఐటీ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన టీఎసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1శాతం లాభడ్డాయి. జస్ట్ డయల్‌, టాటా ఎలక్సీ 2శాతం పెరిగాయి. ఎన్‌ఐఐటీ టెక్‌ షేరు అరశాతం ర్యాలీ చేసింది. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.50శాతం నష్టపోయింది. టెక్‌ మహీంద్రా, హెక్సావేర్‌ షేర్లు అరశాతం​ నష్టపోయాయి. 



You may be interested

రూ.1,170 కోట్ల ఇల్లు కొన్న అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌

Thursday 13th February 2020

ప్రపంచంలో సంపన్న వ్యక్తి , అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ అత్యంత ఖరీదైన ఎస్టేట్‌ను కొనుక్కున్నారు.లాస్‌ ఏంజిల్స్‌లోని బేవర్లీ హిల్స్‌లో ఉన్న  మీడియా మొఘల్‌ డేవిడ్‌ గెఫెన్‌కు చెందిన వార్నర్‌ ఎస్టేట్‌ను 165 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసినట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. మన భారత కరెన్సీలో అక్షరాల 1,170 కోట్ల రూపాయలు.  ఈ కొనుగోలు లాస్‌ ఏంజిల్స్‌లోనే  రికార్డు సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికంటే ముందు ఉన్న

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 13th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు డీమార్ట్‌: డీ మార్ట్‌ మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ 2.27 శాతం వాటాను విక్రయించనున్నట్లు వెల్లడించింది.  జీఐసీ : రష్యాలో వ్యాపారం చేసేందుకు లైసెన్సును పొందినట్లు జనరల్‌ ఇన్సురేన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలపింది.  టాటా కెమికల్స్‌: వేరే కంపెనీల నుంచి 1.08 వాటాను కొనుగోలు చేయడం ద్వారా టాటా సన్స్‌  వాటా 25.26 శాతం పెరగనున్నట్లు టాటా కెమికల్స్‌ వెల్లడించింది.

Most from this category