News


రూపాయి ర్యాలీకి బ్రేక్‌: లాభాల్లో ఐటీ షేర్లు

Wednesday 20th March 2019
Markets_main1553070729.png-24713

నష్టాల మార్కెట్లో ఐటీ ర్యాలీ చేస్తున్నాయి. రూపాయి ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడటం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం 1.50శాతం పెరిగింది. డాలర్‌ మారకం రూపాయి విలువ ఆరు ట్రేడింగ్‌ సెషన్‌లో 161 పైసలు బలపడింది. అయితే రూపాయి భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరగడటం తదితర కారణాలతో మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ ఏకంగా 43పైసలు నష్టపోయింది. ఈ నేపథ్యంలో డాలర్ల మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లు నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. ఈ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరొందిన ఇన్ఫోసిస్‌ నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 3శాతం లాభపడింది. కంపెనీ బై బ్యాంక్‌ ఇష్యూ నేటి నుంచి ప్రారంభం కావడంతో షేర్ల లాభపడ్డాయి. విప్రో 2శాతం, టాటా ఎలాక్సీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ 1.50శాతం పెరిగాయి. అలాగే ఇన్ఫీభీమ్‌ 1శాతం, హెచ్‌సీఎల్‌టెక్‌, మైండ్‌ ట్రీ, టీసీఎల్‌ షేర్లు అరశాతం వరకు ర్యాలీ చేశాయి. మరోవైపు టెక్‌ మహీం‍ద్రా, ఎన్‌ఐఐటీ టెక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(15,495.55)తో పోలిస్తే 1శాతం లాభంతో 15,651ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ మూడు థీమ్స్‌ డిసైడ్‌ చేస్తాయి!

Wednesday 20th March 2019

మార్కెట్‌పై మోర్గాన్‌స్టాన్లీ మరో ఆరేడేళ్లు కొనసాగే బలమైన ఎర్నింగ్స్‌ గ్రోత్‌ సైకిల్‌లోకి భారత్‌ ప్రవేశిస్తోందని మోర్గాన్‌స్టాన్లీ భారత ఈక్విటీ వ్యూహకర్త రిధమ్‌ దేశాయ్‌ చెప్పారు. కేవలం క్రూడాయిల్‌ ధరల్లో అనూహ్య పెరుగుదల మాత్రమే ఈ సైకిల్‌ను దెబ్బతీస్తుందని, లేదంటే బలమైన ఎర్నింగ్స్‌ వృద్ది కొనసాగుతుందని తెలిపారు. భారత మార్కెట్లపై బుల్లిష్‌గా ఉన్నామని, ఏడాది చివరకు సెన్సెక్స్‌ 42 వేల పాయింట్లకు చేరవచ్చని తెలిపారు. వచ్చే మూడేళ్లకు సరిపోయే పోర్టుఫోలియోలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు,

జెట్‌ఎయిర్‌ వేస్‌ షేరు క్రాష్‌లాండింగ్‌

Wednesday 20th March 2019

ముంబై:- ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ఎయిర్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో  పడిపోయింది. నేడు బీఎస్‌ఈలో ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.215.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే పీకల్లోతు అప్పుల కూరుకుపోయిన కంపెనీ నుంచి వైదొలగించేందుకు తన భాగస్వామ్య సంస్థ ఎతిహాత్‌  ప్రయత్నాలు చేస్తుంది. జెట్‌ ప్రివిలెజ్‌ వ్యాపార విభాగంలో తనకున్న 50.1 శాతం వాటాలను కూడా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. షేరు ఒక్కింటికి రూ.

Most from this category