News


మిశ్రమంగా ఐటీ కంపెనీల ఫలితాలు: బ్రోకరేజ్‌ సంస్థలు

Saturday 6th July 2019
news_main1562408498.png-26869

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో ఐటీ సేవల కంపెనీల డిమాండ్‌ కొనసాగవచ్చని పలు బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, డాలర్‌ క్షీణత, వేతనాల పెరుగుదల, అట్రిషన్‌ (ఉద్యోగ వలసలు)రేటు, వీసా సమస్యలు, డాలర్‌ మారకంలో రూపాయి పుంజుకోవడం తదితర కారణాలతో కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని అంటున్నాయి. టైర్‌ -I విభాగపు కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఈ రంగంలో వృద్ధిని సాధించనున్నాయని, టైర్‌ - 2 విభాగం‍లో మిడ్‌క్యాప్‌ కంపెనీలు మిశ్రమ ఫలితాలను సాధించవ్చని బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలైన మోతీలాల్‌ మోస్వాల్‌, ప్రభుదాస్‌ లిల్లాదర్‌, ఎడెల్వీజ్‌లు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఐటీ కంపెనీల ప్రదర్శనపై తమ అభిప్రాయాలను తెలియజేశాయి.
మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ సంస్థ:-
ఈ క్యూ1లో ఆదాయం 11శాతం వృద్ధి చెందుతుంది. ఎబిటా, పీఏటీల వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఎబిటా 8శాతంగానూ, పీఏటీ 4శాతంగా నమోదు కావచ్చు. టైర్‌ విభాగపు కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా కంపెనీల్లో ఎబిటా మార్జిన్లు 50 - 160 బేసిస్‌ పాయింట్లు క్షీణించవచ్చు. ఇటీవల కాలంలో కంపెనీల్లో ఉద్యోగ వలసల రేటు ఎక్కువగా నమోదైంది. అలాగే హెచ్‌-1 బీ వీసాలు సమస్య ఓ కొలిక్కి రాకపోవడం కూడా కంపెనీల లాభదాయకతపై ప్రభావాన్ని చూపుతాయి.
బ్రోకరేజ్‌ సంస్థ టాప్‌ పిక్స్‌:- సియెంట్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, జెన్సాన్‌ టెక్నాలజీస్‌
ప్రభుధాస్‌ లిలాధర్‌ బ్రోకరేజ్‌ సంస్థ:- 
ఈ క్యూ1లో టైర్‌ -I విభాగపు ఐటీ కంపెనీల మిశ్రమంగానూ, టైర్‌ - II విభాగపు కంపెనీలు ఫలితాలు అంత మాత్రంగానే నమోదు కావచ్చు. వేతనాల పెరుగుదల, హెచ్‌-1 వీసాల ధర పెరుగుదల, రూపాయి క్షీణతతో తొలి త్రైమాసికంలో కంపెనీల మార్జిన్లు ఒత్తిడికి లోనవుతాయి. క్వార్టర్‌ టు క్వార్టర్‌ మార్జిన్లు 146 బేసిస్‌ పాయింట్లు క్షీణించవచ్చు. టైర్‌ - 1 కంపెనీల ఆదాయ వృద్ధి 0.7-3.2శాతం మధ్య నమోదుకావచ్చు. తొలి త్రైమాసికంలో టీసీఎస్‌ 3.2శాతంగా ఉండవచ్చు. ఇన్ఫోసిస్‌ 2.5శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేయవచ్చు. ఇయర్‌ టు ఇయర్‌ కంపెనీ ప్రదర్శన అంచనావేస్తే, ఈ త్రైమాసికంలో ఫలితాలు బాగానే ఉంటాయి. అధిక ఆన్‌సైట్ ఖర్చులు, డిజిటల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడం, రూపాయి బలపడటం వంటి అంశాలు కపంపెనీ మార్జిన్‌లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
టాప్‌ పిక్స్‌: టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీస్‌ సర్వీసెస్‌
ఎడెల్వీజ్‌ బ్రోకరేజ్‌ సంస్థ:- 
టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ కంపెనీలు క్వార్టర్‌ టు క్వార్టర్‌ ఆదాయ వృద్ధి 2.8-2.9శాతంగా నమోదు కావచ్చు. విప్రో, టెక్‌ మహీంద్రా కంపెనీల ఆదాయ వృద్ది కొద్దిమేర తగ్గవచ్చు. క్రాష్‌ కరెన్సీ, డాలర్‌ పతనంతో డాలర్ల ద్వారా కంపెనీలు ఆర్జించే ఆదాయాల వృద్ధి క్వార్టర్‌ టు క్వార్టర్‌ 20-25 బేసిస్‌ పాయింట్ల మేర క్షీణించవచ్చు. అధిక వేతనాల పెంపు, ఉద్యోగాల వలస, వీసా ధరలు, రూపాయి బలపడటం లాంటి ప్రతికూలాంశాలతో మార్జిన్లు ఒత్తిడికి లోనవుతాయి. ఈ నేపథ్యంలో టాప్‌-5 కంపెనీల మార్జిన్లు 60-200 బేసిస్‌ పాయింట్లు క్షీణించవచ్చు.
బ్రోకరేజ్‌ సంస్థ టాప్‌ పిక్స్‌:- ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టె‍క్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, ఎల్‌ అండ్‌ సర్వీసెస్‌



You may be interested

మనపై బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం!

Sunday 7th July 2019

బడ్జెట్‌ నిర్ణయాలు కొందరికి తీపిని, కొందరికి చేదును పంచాయి. తక్కువ ఆదాయ వర్గాలకు సంతోషపరిచే నిర్ణయాలు ఉండగా, సంపన్నులకు చేదునిచ్చాయి. వ్యక్తుల బడ్జెట్‌పై ప్రభావం చూపే నిర్ణయాలను గమనిస్తే...   అధిక ఆదాయం కలిగిన వారిపై ఆర్థిక మంత్రి పెద్ద భారాన్నే మోపారు. రూ.2-5 కోట్ల మధ్య​ఆదాయం కలిగిన వారికి ఆదాయపన్ను సర్‌చార్జ్‌ను 3 శాతానికి రూ.5 కోట్లకు పైగా ఉన్న వారికి 7 శాతానికి పెంచేశారు. దీంతో రూ.2-5 కోట్ల ఆదాయ

ఆధార్‌తోనే ఐటీ రిటర్నులు

Saturday 6th July 2019

పాన్‌కార్డు లేకున్నా పర్వాలేదు ఇక స్క్రూటినీ కూడా ఆన్‌లైన్‌లోనే మరింత సులభంగా రిటర్నులు దాఖలు సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలంటే ఇప్పటి వరకు పాన్‌కార్డు తప్పనిసరి. ఇపుడు పాన్‌ కార్డు లేకపోయినా రిటర్నులు దాఖలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పాన్‌కార్డు లేకపోయినా కేవలం ఆధార్‌ కార్డు నెంబర్‌ను ఇవ్వడం ద్వారా ఇక నుంచి ఐటీ రిటర్నులు దాఖలు చేయవచ్చని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో

Most from this category