News


ఆటుపోట్లలో ఐటీ, ఫార్మా.. జోరు

Friday 20th March 2020
Markets_main1584684184.png-32594

5 శాతం జంప్‌చేసిన ఐటీ ఇండెక్స్‌
ఫార్మా కౌంటర్లకూ భారీ డిమాండ్‌
ఐటీకి రూపాయి లాభం
ఫార్మాకు ఎగుమతుల దన్ను

దేశీయంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు మరోసారి ఆటుపోట్లను చవచిచూస్తున్నాయి. లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. అయితే ఐటీ, ఫార్మా రంగాలకు తాజాగా డిమాండ్‌ కనిపిస్తోంది. డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్ట రికార్డును సృష్టిస్తూ 65 మార్క్‌ దిగువకు సైతం పతనంకావడంతో ఐటీ కంపెనీలు లబ్ది పొందే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విధంగా కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కాటు వేస్తున్న కారణంగా దేశీ జనరిక్‌ ఔషధాలకు విదేశాల నుంచి డిమాండ్‌ పెరగనున్ను అంచనాలు ఫార్మా కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు చెబుతున్నారు. 

జోరు తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 11 ప్రాంతంలో ఐటీ ఇండెక్స్‌ 5 శాతం జంప్‌చేయగా.. ఫార్మా రంగం 3.5 శాతం బలపడింది. ఐటీ కౌంటర్లలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, మైండ్‌ట్రీ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, హెక్సావేర్‌, టాటా ఎలక్సీ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కోవిడ్‌-19 కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాలుండటం, నగదు నిల్వల కారణంగా అధిక డివిడెండ్లు, రూపాయి లాభాలు వంటి అంశాలు ఐటీ కంపెనీల పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తికి కారణమవుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు వివరించాయి.

ఎగుమతుల చాన్స్‌ 
అభివృద్ధి చెందిన అమెరికా, యూరోపియన్‌ దేశాలు సైతం కరోనా వైరస్‌ ధాటికి విలవిల్లాడుతుండటంతో దేశీ ఫార్మా రంగానికి ఎగుమతి అవకాశాలు పెరిగే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఉదాహరణకు మలేరియా చికిత్సకు వినియోగించగల క్లోరోక్విన్‌ ఏపీఐకు తాజాగా యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఇప్కా లేబ్స్‌ అనుమతిని పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. ఇది కరోనా చికిత్సకు వినియోగించే వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. దీంతో ఫార్మా రంగంలో ఇప్కా లేబ్స్‌ 8 శాతం జంప్‌చేసి రూ. 1371కు చేరింది. ఇతర కౌంటర్లలో కేడిలా హెల్త్‌కేర్‌ 12 శాతం దూసుకెళ్లగా.. దిగ్గజాలు డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, అరబిందో, సన్‌ ఫార్మా, బయోకాన్‌, దివీస్‌ లేబ్స్‌, గ్లెన్‌మార్క్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. పిరమల్‌, లుపిన్‌ సైతం 1.2-0.6 శాతం చొప్పున బలపడ్డాయి.You may be interested

నేటివార్తల్లోని షేర్లు

Friday 20th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఐసీఐసీఐ లాంబార్డ్‌: కరోనా వైరస్‌  మహమ్మారీ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ గ్రూప్‌ ఇన్సురెన్స్‌ కోవిడ్‌-19 ప్రొటెక‌్షన్‌ ప్లాన్‌ను అందిస్తోంది. జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌:  జమ్ము అండ్‌ కశ్మీర్‌ ప్రభుత్వం  జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌లో  8.95 వాటాను కొనుగోలు చేసేందుకు  ఓపెన్‌ ఆఫర్‌ షేర్‌హోల్డర్స్‌ నుంచి ప్రభుత్వానికి సెబీ మినహాయింపు నిచ్చింది.  ఎస్‌బీఐ: రూ.20,000 కోట్ల నిధులను సమీకరించేందుకు 2021 మార్చి

అమ్మకాల షాక్‌- బ్యాంకింగ్‌ బోర్లా

Friday 20th March 2020

నాలుగు వారాల్లో 35 శాతం పతనం హెచ్‌డీఎఫ్‌సీ ద్వయానికి తప్పని షాక్‌ కుప్పకూలిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ, యాక్సిస్‌ నేలచూపులో గత కొంతకాలంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల ఫేవరెట్‌ రంగంగా నిలుస్తూ వచ్చిన బ్యాంకింగ్‌ ఇటీవల కాలంలో బేర్‌మంటోంది. భారీ అమ్మకాలతో గ్రీన్‌చిప్స్‌గా పేర్కొనే హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం నష్టాలతో డీలా పడుతున్నాయి. ఈ బాటలో ప్రయివేట్‌ రంగ దిగ్గజాలు యాక్సిస్‌, ఐసీఐసీఐ, కొటక్‌ మహీంద్రా సైతం నేలచూపులతోనే కదులుతున్నాయి. వెరసి ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన

Most from this category