News


రిస్క్ ఎందుకనుకుంటున్న ఇన్వెస్టర్లు!

Tuesday 27th August 2019
Markets_main1566903610.png-28055

‘సాధారణ వర్షపాతం కొనసాగితే పంటలు బాగా పండుతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. దీనితో పాటు ప్రభుత్వం అందించే ఆర్థిక చర్యలు, బూస్టర్‌ ప్యాకేజిలు పట్టణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాయి’ అని సర్తి గ్రూప్‌, పార్టనర్‌, సీఐఓ కుంజ్ బన్సాల్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. అంతేకాకుండా నగదు లభ్యత కారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్‌లకు దూరంగా లేరని, రిస్కు తీసుకోవడం ఇష్టం లేకనే దూరంగా ఉన్నారని ఆయన అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...

సెంటిమెంట్‌ మారడం కీలకం..
సెంటిమెంట్‌ను.. మార్కెట్‌, ఎకానమి సెంటిమెంట్‌ (ప్రాథమిక సెంటిమెంట్‌) అనే రెండు విధాలుగా విశ్లేషిస్తాను. గత సెషన్‌లో మార్కెట్‌ ర్యాలీని చూసి మార్కెట్‌ సెంటిమెంట్‌ మారిందని చెప్పవచ్చు. దీంతో పాటు ఆర్‌బీఐ తన మిగులు నిధులను ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆమోదం తెలపడంతో మార్కెట్లు స్వల్పకాలంలో పాజిటివ్‌గా కదిలే అవకాశం ఉంది. మధ్యస్థ లేదా దీర్ఘకాలంలో మార్కెట్‌ లేదా స్టాక్‌ కదలికలు స్థిరమైన ఆర్థిక, ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసిక ఫలితాలతో ఈ అంశాలపై కొంత స్పష్టత రానుంది. దీనికన్నా ముందు,  నెలవారీ ఆటో నంబర్ల ద్వారా కూడా వ్యవస్థలో ఆర్థిక, ప్రాథమిక అంశాలు ఎలా ఉన్నాయో గమనించవచ్చు. 

ఆటో సెక్టార్‌కు బూస్ట్‌ ప్యాకేజి..
ఆటో సెక్టార్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి కొన్ని ప్రకటనలు చేశారు. ప్రభుత్వ కార్యలయాలు కొత్తగా వాహనాలను కొనుగోలు చేయడానికి ఉన్న నిషేదాన్ని ఎత్తివేయడం, తరుగుదలను పెంచడం, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయడం వంటి చర్యలు ఆటో రంగానికి మేలు చేకూర్చేవే. కానీ ఆటో రంగం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వాహానాలపై జీఎస్‌టీ రేట్లను తగ్గించడమనేది ఆర్థిక మంత్రి ప్రకటించలేదు. ఈ నిర్ణయం ఆర్థిక మంత్రి చేతిలో కాకుండా జీఎస్‌టీ కౌన్సిల్‌ ఆధినంలో ఉండడం కూడా గమనించాలి. ఇదే జరిగుంటే వాహనాల డిమాండ్‌ పెరగడానికి ఉపయోగపడేది. ఈ రంగంలో బాటమ్‌ ఔట్‌ అవుతుందా లేదా అనే అంశాన్ని తెలుసుకోడానికి వచ్చే రెండు మూడు నెలల్లో విడుదల కానున్న ఆటో నంబర్లపై మార్కెట్‌ దృష్టిపెట్టనుంది.  అంతేకాకుండా పండుగ త్రైమాసికమయిన, డిసెంబర్ క్వార్టర్‌లో ఆటో రంగం కొంత కోలుకునే అవకాశం ఉంది. అన్నిటికన్నా గ్రామీణ ప్రాంతాల్లో సాధరణ వర్షపాతం వలన పంటలు బాగా పండితే గ్రామీణ వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది. ప్రభుత్వం ఆర్థిక చర్యలు, బూస్టర్లు తీసుకుంటే ఇటువంటి పరిస్థితిని పట్టణ ప్రాంతాలలో కూడా చూడవచ్చు. మరీ ముఖ్యంగా ఇవి వ్యవస్థలో సెంటిమెంట్‌ను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

వినియోగంలో మందగమనం ఇంకా ఉంది...
హిందుస్థాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌), బాటా, ఏసియన్‌ పెయింట్స్‌ స్టాకులు 52 వారాల గరిష్ఠాన్ని తాకడం చూశాం. ఇది వ్యవస్థలో వినియోగ మందగమనం లేదా అనే అనుమానాన్ని రేకెత్తిస్తుంది. కానీ వ్యవస్థలో మందగమనం ఇంకా ఉంది. ఉదాహరణకు  కొన్న వినియోగ ఆధారిత స్టాకులను గమనిస్తే గోద్రేజ్ కన్స్యూమర్, జ్యోతి ల్యాబ్స్ స్టాకులు 52 వారాల కనిష్టానికి దగ్గరలో ట్రేడవుతుండడాన్ని గమనించవచ్చు. మళ్లీ మారికో  52 వారాల గరిష్టానికి దగ్గరగా ఉండడం చూడవచ్చు. దీనికి రెండు మూడు అంశాలు పనిచేస్తున్నాయి. మార్కెట్‌ మధ్యస్థ, దీర్ఘకాలిక కదలికలు  ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా ఆదారపడి ఉంటాయి. దీనితో పాటు డిమాండ్‌ కూడా వినియోగంపై ప్రభావం చూపుతుంది. పెయింటింగ్‌ విభాగం బాగుం‍డడంతో ఏసియన్‌ పెయింట్స్‌ 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. కేవలం ఏసియన్‌ పెయింట్స్‌ మాత్రమే కాదు విభాగంలో అనేక కంపెనీలు జూన్‌ త్రైమాసిక ఫలితాలలో ఆశ్యర్యపరిచాయి. దీని బట్టి సెకండరీ పెయింట్‌ మార్కెట్‌కు కూడా ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంటుందని అంచనా వేయవచ్చు. అంతేకాకుండా వీటి సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు బాగుంటే ఆశ్యర్యపోవాల్సిని పనిలేదు. మార్కె‍ట్‌ లీడర్లగా ఉన్న కొన్ని స్టాకులలోకి నగుదు ప్రవాహం జరుగుతోంది. అందుకే కొన్ని వినియోగ ఆధారిత స్టాకులు 52 వారాల గరిష్ఠాలను తాకుతున్నాయి.You may be interested

2020 చివరికి మాంద్యం..!!?

Wednesday 28th August 2019

కార్వీ రాజీవ్‌ సింగ్‌  బంగారం ర్యాలీ కొనసాగుతుందని, బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈవో రాజీవ్‌సింగ్‌ సూచించారు. 2020 చివరి నాటికి మాంద్యం రావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.    అంతర్జాతీయ ఆర్థిక రంగం మాంద్యంలోకి వెళుతోందా? బ్యాంకు ఆఫ్‌ అమెరికా-మెరిల్‌ లించ్‌ ఫండ్‌ మేనేజర్‌ సర్వేలో తేలిందేమంటే... 34 శాతం మంది వచ్చే 12 నెలల్లో మాంద్యం రావచ్చని

పరుగులు.. కొన్ని స్టాకుల్లోనే!

Tuesday 27th August 2019

ఎఫ్‌పీఐలు తిరిగి వస్తాయి.. ర్యాలీ మాత్రం కొన్ని కౌంటర్లలోనే ఉంటుంది నిపుణుల అంచనా అమెరికా - చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో వర్థమాన దేశాల మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు తన పెట్టుబడులను భారీ స్థాయిలో వెనక్కి తీసుకుంటున్నారు. అందులో భాగంగా మన దేశీయ మార్కెట్‌ను ఎఫ్‌పీఐలు తన పెట్టుబడులను ఉపసంహరణకు ఇంతకాలం సర్‌ఛార్జీల పన్ను విధింపును ఇందుకు ఒక సాధనంగా వినియోగించుకుంచుకున్నారని విశ్లేషకులంటున్నారు. దాదాపు 39 సాక్టుల్లో ఎఫ్‌పీఐలకు మూడోవంతు వాటా ఉంది.

Most from this category