News


మీ పోర్ట్‌ఫోలియోకు హెడ్జింగ్‌ అవసరం

Thursday 16th May 2019
Markets_main1557945401.png-25762

సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ఈ నెల 19న ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వస్తాయని, దీంతో మార్కెట్లలో ఈ నెల 20 నుంచి ఎక్కువ అస్థిరతలు ఉంటాయన్న అంచనాను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వ్యక్తం చేసింది. కనుక ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోకు రక్షణగా హెడ్జింగ్‌ చేసుకోవాలని సూచించింది. మనదేశంలో సాధారణ ఎన్నికల పట్ల మార్కెట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నందున హెడ్జింగ్‌ అవసరమని పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది.

 

సాధారణంగా ఎన్నికల నెలలో మార్కెట్లలో అనూహ్యమైన హెచ్చు తగ్గులుంటాయని, 2004 మే, 2009 మే నెలలో 30 శాతం మేర కదలికలు ఉన్న విషయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలియజేసింది. ఈ నెలలో నిఫ్టీ ఇప్పటికే 500 పాయింట్ల మేర పడిపోయిందని, సెన్సెక్స్‌ 1,700 పాయింట్ల మేర నష్టపోయినట్టు వివరించింది. ‘‘ఎగ్జిట్‌పోల్స్‌ మే 19 సాయంత్రం వెలువడనున్నాయి. దాంతో మార్కెట్లలో 20 నుంచి తీవ్ర ఆటుపోట్లు ఉంటాయి. మే 23న ఓట్ల లెక్కింపునాడు కూడా తీవ్ర అస్థిరతలు ఉంటాయి. ఎన్నికల ఫలితాల గురించి ఎన్నో అనిశ్చితులు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలను బట్టి నిఫ్టీ ఏటో ఒక వైపు భారీగా ఊగిసలాటకు గురి కావచ్చు. ఇన్వెస్టర్లు పూర్తిగా పెట్టుబడులు పెట్టిన వారు తమ పోర్ట్‌ఫోలియోను హెడ్జింగ్‌ చేసుకోవాలని సూచన’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నివేదిక సూచించింది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఉన్నవారు ఇండెక్స్‌ పుట్‌ ఆప్షన్లను కొనుగోలు చేసుకోవాలని సూచించింది. హెడ్జింగ్‌ అనేది బీమా వంటిదని అర్థం చేసుకోవాలని, దీనికోసం కొంత ఖర్చు చేయడం అవసరమని పేర్కొంది.

 

ఎన్నికల ఫలితాల ఆధారంగా మూడు రకాల మార్కెట్‌ పరిణామాలు ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ‘‘బీజేపీ సొంతంగా 272 సీట్లను గెలుచుకుంటుందని ఇన్వెస్టర్లు భావించడం లేదు. ఒకవేళ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తే మార్కెట్లు ర్యాలీ చేస్తాయి. బాగా పడిపోయిన మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కూడా మంచి ర్యాలీ చేస్తాయి. ఇలా జరిగితే నిఫ్టీ మే నెల 11,200 కాల్‌ రూ.297ను కొనుగోలు చేసి, 12,000 కాల్‌ను రూ.47 వద్ద విక్రయించొచ్చు. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని మార్కెట్‌ వర్గాలు ఎక్కువగా అంచనా వేస్తున్నాయి. కనుక అలానే జరిగితే అప్‌మూవ్‌ అనేది పరిమితంగానే ఉంటుంది. ఇలా జరిగితే నిఫ్టీ మే నెల 10,700 కాల్‌ను రూ.617కు కొనుగోలు చేసి, 11,300 కాల్స్‌ రెండింటిని రూ.247కు విక్రయించొచ్చు. ఇక ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైతే, దీన్ని మార్కెట్‌ వర్గాలు అంచనా వేయడం లేదు కనుక మార్కెట్లు తీవ్రంగా స్పందించి నష్టాల పాలవుతాయి. ఇలా జరిగితే 11,000 పుట్‌ను రూ.238 వద్ద కొనుగోలు చేసుకోవచ్చు’’ అని సూచించింది.You may be interested

11150పై ప్రారంభమైన నిఫ్టీ

Thursday 16th May 2019

ప్రపంచమార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం స్వల్ప లాభంతో మొదలైంది.  సెన్సెక్స్‌ 64 పాయింట్లు లాభపడి  37,179 వద్ద నిఫ్టీ 23 పాయింట్లను లాభంతో 11150పైన 11,180 వద్ద ప్రారంభమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసిస్తున్న తరణంలో కార్లు, ఆటో విడిభాగాల దిగుమతులపై సుంకాల విధింపును వాయిదా వేసే యోచనలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు అమెరికా

టాటామోటర్స్‌ 8శాతం పతనం

Wednesday 15th May 2019

టాటామోటర్స్‌ షేర్లు బుధవారం 8శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.185.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అటోరంగ షేర్ల పతనంలో భాగంగా నేడు షేరు 9శాతానికి పైగా నష్టపోయి రూ.167.50ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 8శాతం నష్టంతో 169.60 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో ఈ షేరు రెండోస్థానంలో ముగిసింది. 

Most from this category