STOCKS

News


చూస్తూ చూస్తూ తప్పులో కాలేయొద్దు!

Thursday 14th November 2019
Markets_main1573727867.png-29595

ఆలస్యమైనా సురక్షిత రాబడికే ప్రాధాన్యమివ్వండి
మార్కెట్లో ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి
నీలేశ్‌ షా
ప్రస్తుతానికి తాము టెలికం స్టాకులపై అండర్‌వెయిట్‌గా ఉన్నామని, తమ నిర్ణయం ధైర్యవంతమైన నిర్ణయమా? తెలివితక్కువ నిర్ణయమా? అనేది కాలం తేలుస్తుందని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌షా వ్యాఖ్యానించారు. నిరంతరం నష్టాలు, కష్టాల బాటలో పయనిస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడుల కన్నా మందకొడి వృద్ధి నమోదు చేసే బోరింగ్‌ వ్యాపారాల్లో పెట్టుబడులే నయమని కాలం నేర్పిన పాఠమని చెప్పారు. ఒక నిపుణుడిగా టెలికాం రంగంపై సానుభూతి ఉందని, కానీ ఒక ఇన్వెస్టర్‌గా ఈ రంగంపై పాజిటివ్‌గా లేనని తెలిపారు. వివిధ అంశాలపై ఆయన స్పందన ఇలా ఉంది...
= టెలికం కంపెనీలు ఒకవైపు పోటీని, ఒకవైపు పాత బకాయిల బరువును అనుభవిస్తూ సాగుతున్నాయి. ప్రభుత్వం, నియంత్రణా సంస్థ, కంపెనీల మధ్య అందరికీ న్యాయం చేసే ఒక పరిష్కారం అన్వేషించాల్సిన అవసరం ఇప్పుడెంతైనా ఉంది. కంపెనీలపై విత్త భారాన్ని ప్రభుత్వం, కస్టమర్లు, బ్యాంకులు, కంపెనీలు పంచుకుంటే చాలావరకూ సమస్యలు తీరవచ్చు. ఇందువల్ల ఎకానమీలో సైడ్‌ ఎఫెక్ట్స్ ఏమీ రావు. టెలికాం రంగం నుంచి ఎన్‌పీఏ షాక్‌ రాకుండా చూసుకోవాలి. ఇందుకు సున్నితమైన పరిష్కారం తప్పక చూడాలి.
= ఎప్పటికప్పుడు ఉన్న స్థాయి నుంచి కొంచెం కొంచెం వృద్ధి నమోదు చేస్తున్నా మార్కెట్లు భవిష్యత్‌పై ఆశాజనకంగానే ఉంటుంటాయి. ప్రస్తుతం మార్కెట్లు చాలా నెగిటివ్‌ వార్తలను డిస్కౌంట్‌ చేస్తున్నాయి. భవిష్యత్‌ రికవరీపై ఆశతో మార్కెట్లు ముందుకు సాగడానికే ఇష్టపడుతున్నాయి. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిచ్చి మార్కెట్‌ అంచనాలు నెరవేరితే మార్కెట్‌ మరింత ముందుకు సాగుతుంది. ఒకవేళ ఏమాత్రం అంచనాలు తప్పినా పతనం చాలా వేగంగా ఉండొచ్చు.
= యూఎస్‌లో డౌజోన్స్‌ ఆల్‌టైమ్‌ హై వద్ద ఉంది, ఎకానమీ మంచి పురోగతి చూపుతోంది, నిరుద్యోగ రేటు బాటమ్‌అవుట్‌ అయింది, ఇన్ని పాజిటివ్‌ అంశాల మధ్య కూడా యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గిస్తూ పోతోంది. మన దగ్గర పరిస్థితి ఇంతవరకు రివర్సులో ఉంది. ఇప్పుడిప్పుడే ఆర్‌బీఐ అల్పరేట్ల బాట పట్టింది.
= క్యు2 ఫలితాలు పరిశీలిస్తే నిర్మాణ రంగానికి చెందిన కంపెనీల మార్జిన్లు మందకొడి సమయంలో కూడా పెరిగాయి. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ఫలితాలు బాగా వచ్చాయి. మరోవైపు బ్యాంకుల ఎన్‌ఐఎంలు విస్తరించాయి. ఇవన్నీ భవిష్యత్‌ వృద్ధికి సంకేతాలుగా పరిగణించవచ్చు.
= మార్కెట్లో చౌకగా ఉన్నవి నాణ్యమైనవి కావు, నాణ్యమైనవి చౌకగా లేవు. ప్రస్తుతం అధిక వాల్యూషన్ల వద్ద ఉన్న నాణ్యమైన స్టాకుల్లో ఎక్కువభాగం ఎంఎన్‌సీలకు చెందినవి. ఇవన్నీ వాటి మాతృ కంపెనీలకు ఎక్కువ లాయల్టీలు చెల్లిస్తున్నాయి. మరికొంతకాలానికైనా ఈ లాయల్టీల భారం తగ్గితే వీటి లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి వాటి వాల్యూషన్లను కేవలం పీఈ నిష్పత్తి ఆధారంగా మాత్రమే లెక్కించకుండా విస్తృతమైన మదింపుచేసుకోవాలి. అప్పుడు చాలా వరకు వాల్యూషన్లు సబబేనని తెలుస్తుంది. 
= ఈక్విటీల్లోకి ఎంటర్‌ కాదలిచిన వాళ్లు ఒక కాలపరిమితి పెట్టుకొని రావడం మంచిది కాదు. మార్కెట్లో కదలికలు శాశ్వతం, వీటి ఆధారంగా మనం మన వ్యూహాన్ని రచించుకోవాలి కానీ కేవలం టైమ్‌ పెట్టుకొని లాభాలను ఆశించడం సబబు కాదు. మార్కెట్లో రాదలిచినవాళ్లు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. You may be interested

సెన్సెక్స్‌ లాభం 170 పాయింట్లు

Thursday 14th November 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన కొనుగోళ్లతో గురువారం స్టాక్‌ సూచీలు లాభంతో  ముగిశాయి. సెన్సెక్స్‌ 170 పాయింట్లు లాభంతో 40,286.48 వద్ద, నిఫ్టీ 30.00 పెరిగి 11,870.45 వద్ద స్థిరపడింది. ఆర్థిక, ఐటీ, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్ల ర్యాలీ సూచీల లాభాల ముగింపు కారణమయ్యాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 223

మూడేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Thursday 14th November 2019

దేశీయ హోల్‌సేల్‌ ద్యవ్యోల్బణం(డబ్ల్యూపీఐ, టోకు ద్రవ్యోల్బణం)  అక్టోబర్‌ నెలలో స్వల్పంగా తగ్గి 0.16 శాతంగా నమోదైంది. ఈ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నెలలో 0.33 శాతంగా ఉంది. ఆహర పదార్దాల ధరలు పెరగడంతో డబ్యూపీఐ ఇండెక్స్‌ నెగిటివ్‌ జోన్‌లోకి వెళ్లలేదని విశ్లేషకులు తెలిపారు. కాగా అక్టోబర్‌ నెల డబ్యూపీఐ ద్రవ్యోల్బణం గత మూడేళ్లలో కనిష్ఠం కావడం గమనార్హం. తయారీరంగ వస్తువుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో -0.84 శాతంగా నమోదైంది. ఇది సెప్టెంబర్‌

Most from this category