News


300 పాయింట్ల గ్యాప్‌ అప్‌తో సెనెక్స్‌ ప్రారంభం

Tuesday 3rd March 2020
Markets_main1583208484.png-32234

అంతర్జాతీయ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 300.34 పాయింట్ల లాభంతో 38444.36, నిఫ్టీ  147.3 పాయింట్లు పెరిగి 11280.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధితో  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న తరుణంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)లు తమ సభ్య దేశాలకు ఆర్థిక సాయంతో సహా అన్ని విధాలుగా చేయూత నిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామినివ్వడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. అలాగే  ఇప్పటికే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, జపాన్‌, చైనా తదితర దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపుతో పాటు ఉద్దీపన చర్యలకు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వెలువడటం సైతం అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు మరింత విశ్వాసాన్నిచ్చింది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు 5శాతం లాభంతో ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం 3నుంచి 5శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇక దేశీయ పరిణామాల విషయాకొస్తే... దేశీయ ఫారెక్స్‌ మార్కెట్‌ రూపాయి విలువ నిన్నటి ముగింపు(72.74)తో పోలిస్తే 28పైసలు బలపడి 72.46 వద్ద మొదలైంది. నిన్నటిరోజున ఈక్విటీ అమ్మకాలు వెల్లువెత్తిన నేపథ్యంలో దేశీ కరెన్సీ ఏకంగా 52పైసలు నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా ఎఫ్‌ఐఐలు ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో షార్ట్‌ కవరింగ్‌ చేస్తుండటం సూచీలు భారీ లాభాల దిశగా కదలుతున్నాయి. 

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 500 పాయింట్ల లాభంతో 38645.62 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల పెరిగి 11300 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడ్డాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండక్స్‌ 1శాతానికి పైగా లాభంతో 29,280 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఐషర్‌మోటర్స్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, జీ మీడియా లిమిటెడ్‌, వేదాంత షేర్లు 3శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి.  టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌ షేర్లు 0.10శాతం నుంచి 0.50శాతం నష్టపోయాయి. 



You may be interested

స్టాక్స్‌ బాటలో చమురు ధరలకూ జోష్‌

Tuesday 3rd March 2020

5 శాతం జంప్‌చేసిన చమురు ధరలు ఒపెక్‌, తదితర దేశాల ఉత్పత్తి కోతపై అంచనాలు కేంద్ర బ్యాంకుల సహాయక ‍ప్యాకేజీలపై ఆశలు ఈ కేలండర్‌ ఏడాదిలో తొలిసారి ముడి చమురు ధరలు 4-5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. కరోనా సమస్యలకు చెక్‌ పెట్టేవిధంగా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలను ప్రకటించనున్న అంచనాలు చమురు ధరలకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకోనున్న చర్యలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా

అమెరికా స్టాక్స్‌ జోరు- యాపిల్‌ దూకుడు

Tuesday 3rd March 2020

5 శాతం జంప్‌చేసిన ఇండెక్సులు 2009 తదుపరి రికార్డ్‌ లాభం ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సైతం​రికార్డ్స్‌ సహాయక ప్యాకేజీలపై అంచనాలు కోవిడ్‌-19 భయాలతో పతన బాటలో సాగుతున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లలో ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌ కాలుదువ్వింది. కొమ్ములతో బేర్‌ ట్రెండ్‌ను కుమ్మేసింది. దీంతో డోజోన్స్‌ 2009 తదుపరి అత్యధికంగా లాభపడింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న ఆందోళనలకు చెక్‌ పెడుతూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, జపాన్‌, చైనా తదితర దేశాల కేంద్ర

Most from this category