News


యస్‌బ్యాంక్‌ షేరు ర్యాలీకి రెడీగా ఉందా?

Tuesday 9th July 2019
news_main1562666874.png-26928

మార్కెట్లో మూడు రోజులుగా జరుగుతున్న పతనంతో సంబంధం లేకుండా యస్‌ బ్యాంకు షేరు మాత్రం పాజిటివ్‌గా కదలాడుతోంది. మంగళవారం ఆరంభట్రేడింగ్‌లో దాదాపు 4 శాతం లాభపడిన యస్‌బ్యాంకు షేరు చివర్లో స్వల్ప నష్టంతో క్లోజయింది. తమ ఆర్థిక పరిస్థితి బలంగా, స్థిరంగా ఉందని సోమవారం బ్యాంకు ప్రకటించింది. లిక్విడిటీ, నిర్వహణా సామర్ధ్యం జోరు చూపుతూనే ఉన్నాయని తెలిపింది. దీంతో సోమవారం షేరు మంచి ర్యాలీ జరిపింది. గత కొన్ని నెలలుగా ఆస్తుల నాణ్యత వివాదాలు, మేనేజ్‌మెంట్‌ మార్పులతో షేరు బాగా నష్టపోయింది. ఈ ఏడాది ఇంతవరకు దాదాపు 49 శాతం షేరు క్షీణించింది. అయితే ఇవన్నీ తమను అస్థిరపరిచేందుకు చేసిన కుట్రలని, తమ పనైపోయిందన్న వార్తలను ఖండిస్తున్నామని బ్యాంకు ప్రకటించింది. ఈ విషయాలపై తాము అథార్టీలకు స్పష్టత ఇచ్చామని వివరించింది.

ఈ నేపథ్యంలో బ్యాంకు కౌంటర్లో బలహీనత కేవలం బ్యాంకు పనితీరు వల్ల వచ్చింది కాదని, పలు ఊహాగానాలు, మొత్తం మార్కెట్లో బలహీనత కారణంగా యస్‌బ్యాంకు కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. నిధుల సమీకరణకు మేనేజ్‌మెంట్‌ సంసిద్ధంగా ఉందన్నారు. తాజాగా పలు మొండిపద్దుల వసూలుకు బ్యాంకు తక్షణ చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం బ్యాంకు షేరు వాల్యూషన్లు చౌకగా ఉన్నాయని అందువల్ల కొనొచ్చని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు. వాల్యూషన్లపరంగా స్టాకు ఆకర్షణీయంగా ఉందని, తాము షేరుపై బుల్లిష్‌గా ఉన్నామని ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. షేరుకు రూ. 150 టార్గెట్‌ ధరను ప్రకటించింది. బ్యాంకులో బలహీనత మరో త్రైమాసికం మాత్రం కొనసాగవచ్చని అంచనా వేసింది. పండుగ సీజన్‌ నుంచి బ్యాంకు షేరులో జోరుందని తెలిపింది. జూన్‌ ఫలితాల తర్వాత బ్యాంకుస్టాకు అప్‌గ్రేడ్‌ ఉండొచ్చని టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ సంస్థ అంచనా వేసింద. జూలై 17న బ్యాంకు ఫలితాలు ప్రకటించనుంది. 



You may be interested

సన్‌ఫార్మా 5శాతం అప్‌

Tuesday 9th July 2019

ఫార్మా షేర్ల ర్యాలీలో భాగంగా మంగళవారం సన్‌ షేర్లు 5.50శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.370.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమలో 11-13శాతం వృద్థిని నమోదుచేయవచ్చనే ఇక్రా తన వార్షిక నివేదికలో వెల్లడించడంతో నేటి ట్రేడింగ్‌లో ఫార్మా రంగ షేర్లకు ర్యాలీ జరిగింది. అందులో భాగంగా ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఒక

పన్ను పెరుగుదల మాత్రమే కాదు..!

Tuesday 9th July 2019

పతనానికి ఇంకా చాలా కారణాలున్నాయి అడ్రైన్‌ మోవత్‌ బడ్జెట్‌ అనంతరం మూడో రోజు కూడా మార్కెట్‌ నెగిటివ్‌ మూడ్‌లోనే కొనసాగుతోంది. చాలా మంది అనలిస్టులు ఈ పతనానికి కారణం అధికాదాయ వర్గాలపై పన్ను పెంచడమేనని అభిప్రాయపడుతున్నారు. హెచ్‌ఎన్‌ఐలపై పన్ను పెంచడం ఎఫ్‌పీఐలపై నెగిటివ్‌ ప్రభావం పడుతుందని విశ్లేషిస్తున్నారు. కానీ వర్దమాన మార్కెట్ల నిపుణుడు అడ్రైన్‌ మోవత్‌ మాత్రం పతనానికి ఇంకా చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. కేవలం పన్ను పెంచారని మాత్రమే మార్కెట్లో అమ్మకాల

Most from this category