News


స్మాల్‌, మిడ్‌క్యాప్‌ పెట్టుబడులకు ఇదే సమయం

Wednesday 26th September 2018
Markets_main1537953164.png-20599

చెరువులో నీళ్లు అడుగుకు వెళ్లినప్పుడు చేపలను సులువుగా పట్టుకోవచ్చు. దీనే స్టాక్‌ మార్కెట్‌కు అన్వయించుకున్నారు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ సీఐవో నవ్‌నీత్‌ మునోత్‌. ఇటీవల కాలంలో మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌లో మంచి కరెక‌్షన్‌ జరిగిందని, అందువల్ల వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్‌ పతనం వల్ల కొన్ని లార్జ్‌క్యాప్స్‌ మిడ్‌క్యాప్స్‌ అయ్యాయని, అలాగే కొన్ని మిడ్‌క్యాప్స్‌ స్మాల్‌క్యాప్స్‌ అయ్యాయని పేర్కొన్నారు. స్టాక్స్‌ ఎంపికకు భారత్‌ అనువైన మార్కెట్‌ అని తెలిపారు. వచ్చే మూడేళ్ల కాలంలో మార్కెట్‌లో నాయకత్వ స్థానం మారొచ్చని అంచనా వేశారు. బ్యాంకులు తిరిగి వాటి వాటాను సంపాదించుకుంటాయని తెలిపారు. అలాగే బ్యాంకులు అన్ని విభాగాల్లోనూ సేవలు అందించలేవని, అందువల్ల ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధికి అవకాశాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
2017 మాదిరిగా ప్రస్తుత సంవత్సరం ఉండదని నవ్‌నీత్‌ తెలిపారు. చాలా ఒడిదుడుకులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే సెన్సెక్స్‌ 7 శాతం, నిఫ్టీ 4 శాతం, బీఎస్‌ఈ-100.. 2 శాతం, బీఎస్‌ఈ-500 నెగిటివ్‌, మిడ్‌క్యాప్స్‌ -14 శాతం, స్మాల్‌క్యాప్స్‌ -20 శాతం రిటర్న్స్‌ అందించాయని గుర్తుచేశారు. బ్యాంకులు ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్‌పీఏల సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయని, పలు బ్యాంకులకు అధిక సంఖ్యలో ఎన్‌పీఏలున్నాయని, ఇది ఎన్‌బీఎఫ్‌సీలకు కలిసొచ్చే అంశమని తెలిపారు. అయితే ఫైనాన్స్‌ విభాగంలో వృద్ధి వేగంగా ఉన్నప్పుడు.. కొన్ని సవాళ్లు కూడా ఉత్పన్నమౌతాయని పేర్కొన్నారు. కొన్ని ఫైనాన్స్‌ కంపెనీలు వాటి అసెట్‌ క్వాలిటీ కన్నా ఎక్కువగా రుణాలు తీసుకున్నప్పుడు సమస్యలు వస్తాయని తెలిపారు. గతంలో లిక్విడిటీ పుష్కలముగా ఉన్నందున ఇవి ప్రయోజనం పొందాయని, ఇవి స్వల్పకాలనికి రుణం తీసుకొని,  దీర్ఘకాలానికి రుణమిస్తాయని పేర్కొన్నారు. అయితే రూపాయి సహా పలు ఇతర కారణాల వల్ల ఇప్పుడు లిక్విడిటీ సమస్య ఎదురైందని తెలిపారు. రేట్లు పెరిగాయన్నారు. మెచ్యూరిటీలను రోల్‌ఓవర్‌ చేయడంలో ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు. ఏఏఏ రేటింగ్‌ సంస్థ డిఫాల్ట్‌ కావడం వల్ల పరిస్థతులు జఠిలంగా మారాయని తెలిపారు. 
బ్యాలెన్స్‌ షీట్ల నిర్వహణ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, రికవరీ మెకానిజం బాగున్న.. బలమైన పేరెంట్‌ కలిగిన ఫైనాన్స్‌ కంపెనీలు కానీ బ్యాంకులు కానీ మంచి పనితీరు కనబరుస్తాయని నవ్‌నీత్‌ తెలిపారు. ఈక్విటీ, డెట్‌ విభాగాలపై జాగ్రత్తగా ఉన్నామని పేర్కొన్నారు.  సమీప కాలంలో మార్కెట్లపై ఒత్తిగి ఉంటుందని తెలిపారు. క్రూడ్‌ ధరలు పెరుగుదల, ట్రేడ్‌ వార్‌, ఫెడ్‌ రేట్ల పెంపు, ఎన్నికలు వంటివి ఇందుకు కారణంగా పేర్కొన్నారు. కార్పొరేట్‌ బ్యాలెన్స్‌ షీట్లు బలపడితే, బ్యాంకులు ఎన్‌పీఏ సమస్య నుంచి గట్టెక్కి రుణాలను అందించ గలిగితే, డీమోనిటైజేషన్‌ సహా జీఎస్‌టీ సమస్యలు పూర్తిగా తొలిగిపోతే 2020, 2021లలో బలమైన వృద్ధి  ఉంటుందని అంచనా వేశారు. You may be interested

నిఫ్టీకి తక్షణ మద్దతు 11,000 పాయింట్లు

Wednesday 26th September 2018

మంగళవారం పాజిటివ్‌గా క్లోజయిన సూచీలు తిరిగి బుధవారం నేలచూపులు చూస్తున్నాయి. నిఫ్టీ 11050 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. గురువారం డెరివేటివ్‌ ఎక్స్‌పైరీ క్లోజింగ్‌ సందర్భంగా సూచీలు స్తబ్ధుగా మారాయి. ఇప్పటికైతే మార్కెట్లో ట్రెండ్‌ నెగిటివ్‌గానే ఉందని, చిన్న పాటి షార్ట్‌ కవరింగ్‌లు తప్ప పెద్ద ర్యాలీకి ఛాన్సులు తక్కువని నిపుణుల అంచనా. నిఫ్టీకి 11000 పాయింట్ల వద్ద ప్రస్తుతం తక్షణ మద్దతు లభిస్తోంది. దీనికి దిగువన 10750, 10630, 10557,

వేదాంత వెలుగులు

Wednesday 26th September 2018

అకస్మాత్తుగా వెల్లువెత్తిన కొనుగోళ్లతో బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి వేదాంత షేరు వెలుగులు విరజిమ్ముతోంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో వేదాంత షేరు రూ.231.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా వేదాంత షేరు కూడా మిడ్‌సెషన్‌ వరకు స్తబ్దుగా ట్రేడైంది. అయితే, మధ్యాహ్నం సమయంలో తెలియని కారణాలతో ఈ కౌంటర్లో ఒక్కసారిగా కొనుగోళ్ల సందడి మొదలైంది. ఫలితంగా షేరు 6.50శాతం ర్యాలీ చేసిన రూ.245.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Most from this category