News


బీమా రంగ షేర్లకు భలే గిరాకీ

Thursday 7th November 2019
Markets_main1573114438.png-29416

రానున్న రోజుల్లో బీమా రంగ షేర్లకు మంచి డిమాండ్‌ ఉంటుందని ప్రముఖ అనలిస్ట్‌ గౌరవ్‌ గార్గ్‌ అభిప్రాయపడ్డారు. దేశీయంగా బీమా అత్యంత ఆశాజనక రంగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా దేశీయ ఎక్చ్సేంజీల్లో ఇతర సూచీలు, రంగాల కంటే బీమా రంగ సూచి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో జీవిత బీమా షేర్లు ఇన్వెస్టర్లకు భారీ ఎత్తున ఆదాయాలను సమకూర్చాయి.  ఊహించని, నష్టాన్ని కలిగించే సంఘటనలో భద్రతను అందిస్తున్న కారణంగా దేశ ఆర్ధిక అభివృద్ధికి బీమా పరిశ్రమ చాలా కీలకం రంగాన్ని మారింది. పాలసీదారులు నిర్ణీత గడువులోపు చెల్లింపుల చెల్లిస్తున్న కారణంగా ఈ కంపెనీలకు ధీర్ఘకాలిక మూలధనం గురించి ఎలాంటి ఆందోళన ఉండదు. సేకరించిన నిధులు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, దీర్ఘకాలిక ప్రాజెక్టులకు వినియోగించబడాయి. ఈ రెండు ఆర్థికాభివృద్ధికి చాలా కీలకం.

ఎల్‌ఐసీ బీమారంగాన్ని అతిపెద్ద సంస్థగా ఉంది. అయితే గడిచిన కొనేళ్ల నుంచి ప్రైవేట్‌ రంగ బీమా సంస్థలు సైతం మార్కెట్లో తమ విస్తృతి పెంచుకున్నాయి. ఎక్చ్సేంజీల్లో లిస్టింగ్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లాంటి బీమా కంపెనీలు షేరు చాలా మంచి పనితీరును కనబరిచాయి. సంవత్సరకాలంతో 60 శాతానికి పైగా రాబడిని ఇచ్చాయి. 

బీమారంగంలో పెట్టుబడులకు ఎఫ్‌పీఐలు మొగ్గుచూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత క్యాలెండర్‌ ఏడాదిలో గడిచిన 10నెలల్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు ప్రవాహం భీమారంగంలో అధికంగా ఉంది. జూన్‌-సెప్టెంబర్‌ కాల వ్యవధిలో ఈ రంగంలో ఎఫ్‌పీఐలు రూ.24,714 కోట్ల నికర పెట్టుబడులు పెట్టాయి. ఈ అంశం ఈ రంగంపై ఎఫ్‌పీఐలకు ఉన్న నమ్మకం, ఆసక్తిని తెలియజేస్తుంది.

బీమా రంగాన్ని ప్రోత్సాహించే దిశగా కేంద్ర ప్రభుత్వం సైతం అడుగులు వేస్తోంది. అందులో బాగంగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచింది. అలాగే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన లాంటి బీమా పథకాలను చేపట్టి సామాన్య ప్రజల్లో బీమా ఆవశ్యకతను తెలియజేస్తుంది.

దేశీయ వృద్ధి రోజురోజూకు పెరుగుతుండంతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమలో బలమైన వృద్ధి జనరల్‌ ఇన్సూరెన్స్‌ సెక్టార్‌ రంగానికి కలిసొస్తుంది.అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండటం, ఆయుర్దాయం పెరగడం, గతంలో కంటే ప్రజలు పొదుపు పట్ల ఎక్కువ ఆసక్తి కనబరచడటం, ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉద్యోగాలు ఎక్కువగా పెరగడం పెన్షన్ పథకాల డిమాండ్‌కు ఆజ్యం పోస్తుందని భావిస్తున్నారు. ఈ అంశాలు బీమా రంగానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి.

బలమైన జీడీపీ విస్తరణతో పాటు ప్రస్తుత తక్కువ బీమా ప్రవేశం లాంటి అంశాలు రానున్న ఐదేళ్లలో నాన్‌ లైఫ్‌ సెక్టార్‌ రెండంకెల వృద్ధికి మద్దతునిస్తాయి. ఈ రంగంలోని ప్రధాన కంపెనీల బలమైన ఏయూఐ, నిర్వహణ మార్జిన్ల కారణంగా రానున్న రోజుల్లో బీమా రంగం అత్యుత్తమ ప్రదర్శన కొనసాగుతుందని గౌరవ్‌ గార్గ్‌ అంచనా వేస్తున్నారు. You may be interested

ఇకపై ప్రకటించేది భూ, కార్మిక సంస్కరణలేనా?

Thursday 7th November 2019

మార్కెట్‌ వర్గాల అంచనాలు ఇటీవల కాలంలో మందగిస్తూపోతున్న ఎకానమీని పునరుజ్జీవింపజేసేందుకు ప్రభుత్వం పలు రకాల సంస్కరణలు ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా కుదేలైన గృహనిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు బడా ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఆర్థిక వృద్ధి ఈ చర్యలే సరిపోవని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దేశ వృద్ధి రేటు ఇటీవల కాలంలో బాగా తగ్గుతూ వస్తోంది. ఆర్‌బీఐ సైతం తన తాజా వృద్ధి అంచనాలను తగ్గించింది. ఐఎంఎఫ్‌ లాంటి సంస్థలు కూడా ఇదే

ఐదేళ్లలో రెండింతలయ్యే స్టాకులివే!

Thursday 7th November 2019

మిడ్‌క్యాప్‌ స్టాకుల ‍ప్రదర్శన మార్చి 2015, అగష్టు 2018 మధ్య లార్జ్‌క్యాప్‌లను అధిగమించింది. కానీ గత ఏడాది కాలం నుంచి ఈ స్టాకులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ల వాల్యుషన్లు ఆర్థిక సంవత్సరం 2014 ముందు స్థాయికి చేరుకున్నాయి. పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్స్‌) నిష్పత్తి పరంగా చూసిన, లార్జ్‌ క్యాప్‌ల కంటే మిడ్‌క్యాప్‌లు ఏడేళ్ల గరిష్ఠ రాయితీతో ట్రేడవుతున్నాయి. అదేవిధంగా పీబీ (ప్రైస్‌టూ బుక్‌) నిష్పత్తి పరంగా చూసిన, మిడ్‌క్యాప్‌

Most from this category