News


సెన్సెక్స్‌ను శాసించే షేరు ఇదే!

Saturday 11th January 2020
Markets_main1578715304.png-30852

దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈక్విటీ సూచీలకే సూచికగా మారింది. భవిష్యత్‌లో సెన్సెక్స్‌ కదలికలు పసిగట్టాలంటే ఈ షేరును పరిశీలిస్తే చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు దశాబ్దాల బ్యాంకు షేరు, సెన్సెక్స్‌ల కదలికలను సామ్‌కో సెక్యూరిటీస్‌ మదింపు చేసింది. ఎప్పుడైతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు ఒక కొత్త గరిష్ఠాన్ని చేరిందో, అప్పుడల్లా సెన్సెక్స్‌ కూడా స్వల్ప వ్యవధిలోనే కొత్త గరిష్ఠాలను చేరిందని ఈ మదింపులో బ్రోకరేజ్‌ సంస్థ కనుగొంది. ‘‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు ఒక రహస్య ఇండికేటర్‌, బుల్‌ మార్కెట్‌ నిజ పరిస్థితిని కచ్ఛితంగా ప్రతిబింబిస్తుంది. ఇరవైఏళ్లలో ఈ షేరు కొత్త జీవితకాల హైకి చేరినప్పుడల్లా మార్కెట్‌ కూడా వెనకాతలే ఫాలో అయింది.’’అని బ్రోకింగ్‌ సంస్థ తెలిపింది. ఈ వారం ద్వితీయార్థంలో జరిగిన మార్కెట్‌ర్యాలీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత రికార్డుస్థాయి రూ. 1,305 వద్దకు చేరలేకపోయింది. ఇదేతరహాలో సెన్సెక్స్‌ సైతం 40,810 పాయింట్ల రికార్డుస్థాయిని అందుకోలేకపోవడం గమనార్హం. 

చాలా ఫండ్‌ మేనేజర్లు ఈ బ్యాంకు షేరును ఫేవరెట్‌గా పరిగణిస్తారు. గత ఆరునెలల్లో టాప్‌10 ఎంఎఫ్‌లు ఇందులో వాటాలు పెంచుకున్నాయి. గతేడాది ప్రధాన సూచీలు 15 శాతం రాబడినివ్వగా, ఈ షేరు 21.27 శాతం రాబడినిచ్చింది. పలు బ్రోకరేజ్‌లు ఈ షేరుపై కొనొచ్చు రేటింగ్‌తో ఉన్నాయి. రాబోయే కాలంలో షేరు మరింత దూసుకుపోతుందని, బ్యాంకు ఫలితాలు మరింత బలంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నాయి. వచ్చే 12-18నెలల్లో అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్స్‌ను లిస్టింగ్‌కు తీసుకురావాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆలోచిస్తోంది. ఇదే జరిగితే బ్యాంకు షేరుకు మరింత ఉత్సాహం రావచ్చని సామ్‌కో సెక్యూరిటీస్‌ భావిస్తోంది. 



You may be interested

చందా కొచర్‌ ఆస్తులు ఈడీ జప్తు

Saturday 11th January 2020

న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసులో ఐసీఐసీఐ మాజీ చైర్మన్‌ చందా కొచర్‌, మరికొందరికి చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఈ మేరకు అక్రమ ధనార్జనా  నిరోధక చట్టం నిబంధనల కింద ఒక ఉత్తర్వ్యు జారీ అయ్యింది. ముంబైలో కొచర్‌కు ఉన్న ఇల్లు, అమెతో సంబంధం ఉన్న ఒక కంపెనీకి చెందిన ఆస్తులు... జప్తు అయిన వాటిలో ఉన్నట్లు శుక్రవారం అత్యున్నత స్థాయి

యూఎస్‌ మార్కెట్‌ డౌన్‌- ఇన్ఫీ అప్‌

Saturday 11th January 2020

రికార్డ్‌ గరిష్టాల నుంచి వెనక్కి ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.6 శాతం ప్లస్‌  టాటా మోటార్స్‌ 2 శాతం అప్‌ వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు చివర్లో డీలాపడ్డాయి. తొలుత రికార్డ్‌ గరిష్టాలను అందుకున్న మార్కెట్లు తదుపరి ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెనకడుగు వేశాయి. వెరసి శుక్రవారం డోజోన్స్‌ 133 పాయింట్లు(0.45 శాతం) నీరసించి 28,824 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 9 పాయింట్లు(0.3 శాతం) తక్కువగా 3,265 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ 25 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి

Most from this category