News


బడ్జెట్‌ తెచ్చిన భయం కొనసాగేనా?

Saturday 13th July 2019
Markets_main1563021938.png-27048

మార్కెట్‌ విశ్లేషణ
దేశీయ మార్కెట్‌ ఈ వారాన్ని తీవ్ర నిరుత్సాహంతో ముగించింది. వారం ఆరంభంలో ఇటీవల కాలంలో అతిపెద్ద ఒకరోజు పతనం నమోదు చేసింది. కేంద్ర బడ్జెట్‌ మార్కెట్‌లో నిరాశ నింపిందని, అందువల్లే మార్కెట్లు తిరోగమనం చెందాయని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. అయితే అధిక వాల్యూషన్లే ఈ పతనానికి అసలు కారణమని, వాల్యూషన్ల కారణ కరెక‌్షన్‌కు బడ్జెట్‌ ఒక ప్రోత్సాహకంగా పనిచేసిందని సామ్‌కో సెక్యూరిటీస్‌ ప్రతినిధి జిమిత్‌ మోదీ చెప్పారు. ప్రస్తుతం నిఫ్టీ తన ఆల్‌టైమ్‌ హై పీఈ వద్ద ఉందన్నారు. ఇలాంటప్పుడు బడ్జెట్లో ఎలాంటి మెరుపులు లేకపోవడం సూచీల్లో నిరాశ నింపిందన్నారు. వినిమయ వాతావరణం మందగించడంతో ఆటో, వినిమయ రంగాల స్టాకులు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. 
టెక్నికల్‌ అవుట్‌లుక్‌


భారీ పతనం అనంతరం మరో కరెక‌్షన్‌కు రెడీ అవుతున్న సూచీలు ఇందుకోసం కన్సాలిడేట్‌ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎర్నింగ్స్‌ సీజన్‌ ఆరంభం కావడం వల్ల ఈ కరెక‌్షన్‌ ముందరి కన్సాలిడేషన్‌ కొంచెం ఎక్కువకాలం కొనసాగవచ్చు. ప్రస్తుత 11400 పాయింట్ల మద్దతు స్థాయి నిఫ్టీకి అత్యంత కీలకం కానుంది. దీన్ని పోగొట్టుకుంటే చాలాలోతైన పతనం ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ట్రేడర్లు పెరిగినప్పుడు, లేదా 11400 పాయింట్ల దిగువకు వచ్చినప్పుడు షార్ట్‌ పొజిషన్లు తీసుకోవచ్చని నిపుణుల సూచన. అంతర్జాతీయంగా గల్ఫ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చమురు ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఇది కూడా భారత మార్కెట్లపై నెగిటివ్‌ ప్రభావం చూపుతుంది. ఈ వారం ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ కవలలు క్యు1 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని మదుపరలను నిపుణులు హెచ్చరిస్తున్నారు. You may be interested

క్రూడాయిల్‌ ర్యాలీ కొనసాగదు!

Saturday 13th July 2019

తాత్కాలిక పరిస్థితుల వల్ల తాజా పెరుగుదల  దీర్ఘకాలానికి డౌన్‌ట్రెండే అంతర్జాతీయ నిపుణుల అంచనా చమురు మార్కెట్లో ప్రస్తుతం అప్‌మూవ్‌ కనిపిస్తోంది. గల్ఫ్‌ ఉద్రిక్తతలు, వెనుజులా, ఇరాన్‌ పరిణామాలు, ఒపెక్‌ ఉత్పత్తి కోతలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఇతర దేశాల్లో ఉత్పత్తి క్షీణించడం.. లాంటివి చమురు డిమాండ్‌ను పెంచుతున్నాయి. అయితే ఈ అప్‌మూవ్‌కు జీవం చాలా తక్కువని, ర్యాలీ మరింత కాలం కొనసాగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ర్యాలీలో బ్రెంట్‌ మరోమారు 70 డాలర్లను దాటవచ్చని

వీఐఎక్స్‌ అలా... మార్కెట్‌ ఇలా...!

Saturday 13th July 2019

మార్కెట్లు బడ్జెట్‌ తర్వాత ఒక్కమారుగా తిరోగమనం బాటపట్టాయి. నిఫ్టీ 11500 పాయింట్ల వరకు పతనమైంది. దీంతో గత కొన్ని నెలల రేంజ్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపినట్లయింది. ప్రస్తుతం నిఫ్టీ తన 20 రోజుల డీఎంఏకు దిగువన ఉంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌ కదలికలను ప్రతిబింబించే వీఐఎక్స్‌ సైతం పలు నెలల కనిష్ఠానికి దిగజారడం గమనార్హం. ప్రస్తుతం వీఐఎక్స్‌ 12- 13 రేంజ్‌లో కదలాడుతోంది. ఈ విధంగా ఒక పక్క

Most from this category