News


రికార్డుస్థాయికి ఐఆర్‌సీటీసీ

Friday 31st January 2020
Markets_main1580461754.png-31372

కేంద్ర ప్రభుత్వం రేపు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రేల్వే రంగంలో సేవలను అందించే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) శుక్రవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 3.65శాతం లాభపడి రూ.1177.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.1:30నిల.లకు షేరు క్రితం ముగింపు ధర(రూ.1136.20)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.1170.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు వారం రోజుల ట్రేడింగ్‌ సెషన్‌లో 15శాతం, నెలలో 24శాతం ర్యాలీ చేసింది. ఈ ఫిబ్రవరి 12న జరిగే బోర్డు సమావేశంలో డిసెంబర్‌ కార్వర్ట్‌ ఫలితాలను విడుదల చేయనుంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.320లు, రూ.1177లుగా నమోదయ్యాయి. 

 ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కొనుగోలు రేటింగ్‌ కేటాయించింది. టార్గెట్‌ ధరను రూ.1339లుగా నిర్ణయించింది. కేటాయించిన టార్గెట్‌ ధర గురువారం ముగింపు ధరతో పోలిస్తే 18శాతం అప్‌ట్రెండ్‌లో ఉంది. కంపెనీ రైల్వే ప్రయాణికులకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, క్యాటరింగ్ సేవలను అందించడంలో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్యాకేజ్డ్‌ తాగునీటిపై అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చనే అంచనాలతో ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తన నివేదికలో పేర్కోంది. 

మరోవైపు ఇదే సమయంలో రైల్వే రంగానికి చెందిన మిగతా షేర్లు నష్టాల్ని చవిచూసాయి. ఇక్రాన్‌ షేరు 3శాతం, టిటాగర్‌ 5.50శాతం, రైల్‌ వికాస్‌ నిగమ్‌ 1.50శాతం, రైట్స్‌ 1శాతం పతనయ్యాయి. 



You may be interested

స్టేట్‌బ్యాంక్‌ నికర లాభం రూ. 5583 కోట్లు

Friday 31st January 2020

స్టాండెలోన్‌ ప్రాతిపదికన 41 శాతం అప్‌ 2.6 శాతం పుంజుకున్న ఎస్‌బీఐ షేరు  దేశీ బ్యాంకింగ్‌  రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ. 5,583 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 41 శాతం వృద్ధికాగా.. ఎస్సార్‌ స్టీల్‌, ఎన్‌ఐఐ తదితర మొండి ఖాతాల నుంచి రికవరీలు లాభాల్లో వృద్ధికి సహకరించినట్లు ఎస్‌బీఐ

ఐబీఎం సీఈఓ గా భారతీయుడు

Friday 31st January 2020

  న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన మరో టెక్నాలజీ నిపుణుడికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాకు చెందిన మల్టీనేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీ అయిన ఐబీఎం (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషిన్స్‌ కార్పోరేషన్‌)కు భారతసంతతికి చెందిన  అరవింద్‌ కృష్ణ సీఈఓ(చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ ఆఫీసర్‌) గా నియమితులయ్యారు. ఐబీఎం బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లంతా కలిసి అరవింద్‌‌ కృష్ణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కృష్ణ  ప్రస్తుతం ఐబీఎంలో క్లౌడ్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగానికి సీనియర్‌ ప్రెసిడెంట్‌గా

Most from this category