News


రూ.2,000కు చేరువలో ఐఆర్‌సీటీసీ

Thursday 20th February 2020
Markets_main1582185492.png-31959

దలాల్‌ స్ట్రీట్‌లో ఐఆర్‌సీటీసీ షేరు పరుగులు ఆపడం లేదు. షేరు గురువారం ట్రేడింగ్‌లో మరోసారి కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసి, రూ.2,000 మ్యాజిక్‌ మార్క్‌కు చేరువయ్యింది. నేడు ఈ షేరు బీస్‌ఈలో రూ.1875.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపడంతో ఒక దశలో 6శాతం పెరిగి రూ.1939.80 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. లిస్టింగ్‌ ధర నుంచి రూ.320 నుంచి షేరు 300 శాతం లాభపడింది. లిస్టైన నాటి నుంచి కేవలం 92 ట్రేడింగ్‌ సెషన్లలో 23 సార్లు ఇంట్రాడే హైని తాకింది. ఈ షేరు నెలరోజుల్లో 91శాతం, వారంలో 20శాతం లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచింది. షేరు ధర దాని 5రోజులు, 20రోజుల, 100 రోజుల, 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ల కంటే పైనే ట్రేడ్‌ అవుతోంది.

ఈ రంగంలో గుప్తాధిత్యం కారణంగా క్యాటరింగ్, టూరిజం, ఆన్‌లైన్ టికెటింగ్ లాంటి సేవలు కంపెనీకి భారీ లాభాల్ని తెచ్చి పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ విస్తరణతో ఆన్‌లైన్‌లో రైల్వే బుకింగ్‌ పెరగడం షేరు కలిసొచ్చింది. ఆర్థిక సంవత్సరం 2018-19 లో ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ నుంచి రోజుకు సగటున 7.8లక్షల రైల్వే టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే వాల్యూవేషన్స్‌ అధికంగా ఉన్న నేపథ్యంలో షేరు ఏ దశలోనైనా పరుగు ఆగవచ్చని విశ్లేషకులు ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు.



You may be interested

కరోనాతో ఏపీఐ ఫార్మా షేర్ల లాభాల పంట!

Thursday 20th February 2020

నాట్కో ఫార్మా, ‍శిల్పా మెడి, గ్రాన్యూల్స్‌కు జోష్‌ గత రెండు నెలల్లో 40- 110 శాతం మధ్య ప్లస్‌ దేశీయంగా యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రెడియంట్స్‌(ఏపీఐ) తయారు చేసే కంపెనీల కౌంటర్లు గత కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి. ఫార్ములేషన్స్‌, ఫినిష్డ్‌ డోసేజీల తయారీలో వినియోగించే ఏపీఐలను దేశీయంగా పలు కంపెనీలు రూపొందిస్తున్నాయి. అయితే చైనా నుంచి సైతం అధిక శాతంలో దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజాలు ఏపీఐలు, ఇంటర్మీడియెట్లను దిగుమతి చేసుకుంటుంటాయి. ఇటీవల చైనాలోని

బ్యాంక్‌ నిఫ్టీ కనిష్టం నుంచి 370 పాయింట్ల రికవరీ..!

Thursday 20th February 2020

బ్యాంకింగ్‌ రంగ షేర్ల రికవరీతో మిడ్‌ సెషన్‌ కల్లా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ రికవరీ అయ్యింది. మిడ్‌ సెషన్‌ కల్లా ఇంట్రాడే కనిష్టస్థాయి(30702.45) నుంచి ఏకంగా 372.25 పాయింట్లు లాభపడింది. ఏజీఆర్‌ అంశంలో సుప్రీం కోర్టు తీర్పుతో కష్టాలను ఎదుర్కొంటున్న వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు కేంద్రం ప్రభుత్వం నుంచి సహాయం అందవచ్చనే అంచనాలతో బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(30,838.20)తో పోలిస్తే 0.68శాతం లాభం‍తో 31వేలపైన

Most from this category