News


గ్రే మార్కెట్లో ఐఆర్‌సీటీసీ షేర్లకు భారీ ప్రీమియం

Friday 11th October 2019
Markets_main1570786730.png-28827

బంపర్‌ లిస్టింగ్‌ సంకేతాలు
ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) షేర్లు సోమవారం బంపర్‌ లిస్టింగ్‌ నమోదు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన అనూహ్య స్పందనే షేర్ల లిస్టింగ్‌పై అంచనాలను పెంచగా, తాజాగా షేరుకు గ్రేమార్కెట్లో పెరిగిన ప్రీమియం ఈ అంచనాలను మరింత బలపరుస్తోంది. శుక్రవారం గ్రేమార్కెట్లో కంపెనీ షేరు దాదాపు 70 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. చాలా రోజుల తర్వాత ఒక కొత్త కంపెనీ షేరు ఇంత ప్రీమియంతో ఉందని, అంతేకాకుండా ఒక పీఎస్‌యూ కంపెనీకి ఇంత ప్రీమియం రావడం అనూహ్యమని గ్రేమార్కెట్‌ డీలర్లు చెబుతున్నారు. కొత్తగా లిస్టయ్యే షేర్లు సాధారణంగా గ్రేమార్కెట్లో ట్రేడవుతుంటాయి. ఇందులో ఎక్కువగా హెచ్‌ఎన్‌ఐలు పెట్టుబడులు పెడుతుంటారు. ఇష్యూలకు భారీ స్పందన వచ్చిన సందర్భాల్లో వాటి షేర్లకు గ్రేమార్కెట్లో విపరీత డిమాండ్‌ పెరుగుతుంటుంది. ఐఆర్‌సీటీసీ ఐపీఓ దాదాపు 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్కై‍్రబ్‌ అయింది. ఇష్యూ ధర రూ. 320 కాగా, గ్రేమార్కెట్లో ఇంతకు మరో 50 రూపాయలతో ఆరంభమైన ప్రీమియం గరిష్ఠఃగా రూ 227 వరకు చేరింది. ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 645 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 



You may be interested

ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ జోరుగా కొన్న షేర్లివే!

Friday 11th October 2019

దేశీయంగా రెండవ అతి పెద్ద ఆస్తి నిర్వహణ సంస్థయిన ఐసీఐసీఐ ప్రూడన్సియల్‌ ఏఎంసీ, సెప్టెంబర్‌ నెలలో ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ, ఫైనాన్సియల్స్‌, ఇన్సురెన్స్‌, పవర్‌, ఫార్మా స్టాకులను భారీగా కొనుగోళ్లు చేసింది. ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) దిగ్గజ కంపెనీ అయిన ఐటీసీ, ప్రభుత్వ రంగ హైడ్రోపవర్‌ ఉత్పత్తి సంస్థయిన ఎన్‌హెచ్‌పీసీ కంపెనీ షేర్లను కోటీ చొప్పున కొనుగోలు చేసింది. కాగా ఈ కంపెనీల షేరు విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి

యస్‌ బ్యాంక్‌ 6% పతనం!

Friday 11th October 2019

  నిధుల సమీకరణలో భాగంగా మైక్రోసాఫ్ట్‌తో యస్‌ బ్యాంక్‌ చర్చలు జరుపుతోందన్న మీడియా కథనాలను యెస్‌ బ్యాంక్‌ తోసిపుచ్చడంతో, ఈ బ్యాంక్‌ షేరు విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమవుతోంది. మధ్యాహ్నాం 12.49 సమయానికి ఈ బ్యాంక్‌ షేరు విలువ 6.35 శాతం నష్టపోయి రూ. 38.35 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 40.95 వద్ద ముగిసిన ఈ షేరు, శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో రూ. 41.00 వద్ద

Most from this category