News


ఈ నెల 30 నుంచి ఐఆర్‌సీటీసీ ఐపీవో

Wednesday 25th September 2019
Markets_main1569353081.png-28522

భారతీయ రైల్వేకు చెందిన అనుబంధ కంపెనీ ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఐపీవో అతి త్వరలోనే ఇన్వెస్టర్ల ముందుకు రానుంది. ఈ నెల 30 నుంచి ఐపీవోను చేపట్టాలని కంపెనీ ప్రణాళిక.

 

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును గణనీయంగా తగ్గించడంతో దేశ ఈక్విటీ మార్కెట్లు ఒక్కసారిగా బేరిష్‌ నుంచి బుల్లిష్‌గా మారిన వెంటనే ఐఆర్‌సీటీసీ తన ఐపీవో ప్రణాళికను బయటకు తీయడం గమనార్హం. కార్పొరేట్‌ పన్ను కోతతో సూచీలు ఇప్పటికే 8 శాతం పెరిగాయి. గడిచిన కొన్ని నెలల్లో ఐపీవో మార్కెట్‌ చతికిల పడి ఉంది. ఒకటి రెండు మినహా పెద్దగా ఐపీవోలు రాలేదు. మార్కెట్లు తీవ్ర అనిశ్చిత పరిస్థితుల్లో, బేరిష్‌ సెంటిమెంట్‌ ఉండడంతో ఐపీవో ప్రణాళికలను కంపెనీలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కానీ, ఉన్నట్టుండి మార్కెట్లు సానుకూలంగా మారడం ఐపీవో మార్కెట్‌లో మళ్లీ కళ నెలకొననుంది. ఇందులో ముందుగా ఐఆర్‌సీటీసీ ఉండడం మరింత ఆసక్తికరం. 

 

ప్రతిపాదిత ఐఆర్‌సీటీసీ ఐపీవో ద్వారా ప్రభుత్వం రూ.480 కోట్లను సమీకరించాలనుకుంటోంది. అంటే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రభుత్వం ఐఆర్‌సీటీలోని తనకున్న వాటాలో కొంత మొత్తాన్ని ఐపీవోలో భాగంగా విక్రయించనుంది. అంటే ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధులు ప్రభుత్వ ఖజానాకే వెళతాయి. ఐఆర్‌సీటీసీలో 12.5 శాతం వాటాను ప్రభుత్వం ఐపీవో ద్వారా తగ్గించుకుంటోంది. సుమారు 2 కోట్ల షేర్లను విక్రయించనుంది. షేరు ధరల శ్రేణిని ఐఆర్‌సీటీసీ బుధవారం ప్రకటించనుందని తెలుస్తోంది. ఐపీవో కోసం పత్రాలను ఆగస్ట్‌లోనే దాఖలు చేసి అనుమతి పొందడం గమనార్హం. 

 

ఐఆర్‌సీటీసీ వ్యాపారం నాలుగు విభాగాలుగా ఉంటుంది. ఇంటర్నెట్‌ టికెట్లు, క్యాటరింగ్‌, ‘రైల్‌నీర్‌’ బ్రాండ్‌ పేరుతో డ్రింకింగ్‌ వాటర్‌, పర్యాటకం, టూరిజం ప్యాకేజీలు. ఐఆర్‌సీటీసీ అమ్మకాలు 2018-19లో 25 శాతం పెరిగి రూ.1,899 కోట్లుగా ఉంటే, నికర లాభం 23.5 శాతం వృద్ధితో రూ.272.5 కోట్లుగా ఉంది. ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రతీ నెలా 2.5 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. 



You may be interested

స్వల్ప నష్టాలతో ప్రారంభం

Wednesday 25th September 2019

 ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 9 పాయింట్ల నష్టంతో 39,087 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 11,565 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

సెన్సెక్స్‌ ప్లస్‌...నిఫ్టీ మైనస్‌

Tuesday 24th September 2019

11600 దిగువన నిఫ్టీ ముగింపు లాభాల స్వీకరణ, బ్యాంకింగ్‌ షేర్ల  పతనం రెండురోజుల బ్లాక్‌బాస్టర్‌ ర్యాలీ తర్వాత మంగళవారం రోజం‍తా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ 11600 స్థాయిని కోల్పోగా సెన్సెక్స్‌ 36000 స్థాయిని నిలబెట్టుకుంది. నిఫ్టీ 12 పాయింట్లను కోల్పోయి 11,588.20 వద్ద, సెన్సెక్స్‌ 7.11 పాయింట్లు స్వల్ప లాభంతో 39,097 వద్ద స్థిరపడ్డాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ, బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్ల పతనంతో పాటు

Most from this category