News


ఐఆర్‌సీటీసీ రివర్స్‌ పరుగు

Tuesday 24th March 2020
Markets_main1585044294.png-32653

7వ సెషన్లోనూ డౌన్‌ సర్క్యూట్‌
7 రోజుల్లో 30 శాతం పతనం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీయంగానూ రైల్వే సర్వీసులు బంద్‌కావడంతో పీఎస్‌యూ ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ కౌంటర్‌కు షాక్‌ తగులుతోంది. కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడితో పతన బాటలో సాగుతున్న ఈ కౌంటర్‌ మరోసారి కుదేలైంది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో రూ. 45 క్షీణించి రూ. 858 వద్ద ఫ్రీజయ్యింది. 

ఇదీ తీరు
గత ఏడు సెషన్లుగా ఐఆర్‌సీటీసీ షేరు లోయర్‌ సర్క్యూట్లను తాకుతూ వస్తోంది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఈ షేరు 1995 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. తదుపరి వెనకడుగు వేస్తూ వస్తోంది. ఈ బాటలో ఈ నెల 13న నమోదైన రూ. 1228 నుంచి చూస్తే 30 శాతం నష్టపోయింది. గతేడాది అక్టోబర్‌లో  ఈ షేరు 101 శాతం ప్రీమియంతో రూ. 644 వద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. 

కారణాలివీ..
కరోనా దేశీయంగానూ తలెత్తడంతో అన్ని రకాల రైల్‌ సర్వీసులను నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  దీంతో ఆల్‌లైన్‌ టిక్కట్లు, ప్యాకేజ్‌డ్‌ వాటర్‌, కేటరింగ్‌ తదితర సర్వీసులకు విఘాతం ఏర్పడింది. ప్రీమియం ట్రయిన్లు, కొంకణ్‌ రైల్వే తదితర పలు సర్వీసులు రద్దయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్‌, టూరిజం పరిశ్రమ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.  దీంతో ఐఆర్‌సీటీసీ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.You may be interested

స్టాక్‌ మార్కెట్‌కు సీతమ్మ భరోసా..!

Tuesday 24th March 2020

అతి త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటన 692 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌ 190 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ  స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభంతో ముగిసింది. కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అతి తర్వలో కార్పోరేట్లకు ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. కొన్ని ఫైనాన్షియల్‌ వెసులుబాట్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆమె పేర్కోన్నారు.  దీనికి తోడు ఆర్థిక స్థిరీకరణకు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ హామీతో ఆసియాతో పాటు యూరప్‌

బంగారానికి ఫెడ్‌ బూస్టింగ్‌..!

Tuesday 24th March 2020

రెండురోజుల్లో 118 డాలర్ల లాభం దేశీయంగా రూ.1721లు లాభం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెడుతోంది.  కరోనా వైరస్‌ వ్యాధితో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ తిరిగి స్థిరపడేంతవరకు ఎంతంటి చర్యలకైన వెనకాడబోమని అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ హామి ఇవ్వడంతో బంగారం ధర కనిష్ట స్థాయి నుంచి భారీగా రికవరీ అయ్యింది. గడచిన రెండు రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 118 డాలర్లు, దేశీయంగా రూ.1721లు లాభపడింది.  ఫెడ్‌ రిజర్వ్‌

Most from this category