News


ఐఆర్‌సీటీసీలో ఇంకెంత సత్తా?

Thursday 31st October 2019
Markets_main1572460970.png-29242

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సంవత్‌ 2075లో మల్టీబ్యాగర్‌ రిటర్నులు పంచింది. అక్టోబర్‌లో ఇది ఐపీవోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో షేరును రూ.320కు ఇష్యూ చేయగా, కేవలం ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలోనే 181 శాతం పెరిగింది. లిస్టింగ్‌ రోజునే రూ.728.60 వరకు వెళ్లింది. దీంతో ఐఆర్‌సీటీసీ మార్కెట్‌ విలువ రూ.15,000 కోట్ల స్థాయికి చేరిపోయింది. ఐఆర్‌సీటీసీ షేరు ఇంత అద్భుత ప్రదర్శనకు కారణం వ్యాపార పరంగా గుత్తాధిపత్యం కలిగి ఉండడమే. రైల్వేకు ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌, కేటరింగ్‌ సేవలు అందించే ఏకైక సంస్థ. అలాగే, బాటిల్డ్‌ వాటర్‌, ప్రైవేటుగా రైళ్ల నిర్వహణ వ్యాపారాలు కూడా కలిగి ఉంది. దీంతో దీర్ఘకాలంలో మంచి నగదు ప్రవాహాలు కంపెనీకి ఉంటాయని మెహతా ఈక్విటీస్‌ రీసెర్చ్‌ ఏవీపీ ప్రశాంత్‌ తాప్సే తెలిపారు. ‘‘ప్రభుత్వరంగ కంపెనీలకు మంచి విలువ సృష్టించే దిశగా ప్రభుత్వం సరైన అడుగు వేసింది. భవిష్యత్తులో ఈక్విటీ విక్రయం ద్వారా ప్రభుత్వం తన 2020 ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోగలదు’’ అని తాప్సే వివరించారు. 

 

ఐపీవోలో ఐఆర్‌సీటీసీ ఇష్యూ ధరను తక్కువగా నిర్ణయించారన్న అంశంపై తాప్సే మాట్లాడుతూ.. ‘‘మార్కెట్‌ సరైన ధరను గుర్తించే విధంగా పనిచేస్తుంది. ఐఆర్‌సీటీసీ కేసులోనూ మార్కెట్‌ సరైన ధరను గుర్తించిందని భావిస్తున్నాం. ఈక్విటీ మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో మర్చంట్‌ బ్యాంకర్లు చాలా రక్షణాత్మకంగా ధరను నిర్ణయించి ఉంటారు’’ అని తాప్సే పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలంలో ఐఆర్‌సీటీసీ మంచి సంపదను సమకూర్చి పెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘రైల్వే కేటరింగ్‌లో 72 శాతం వాటా కలిగి, మినీరత్న హోదా కలిగిన ఐఆర్‌సీటీసీని సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లకు ఓ భిన్నమైన అవకాశం లభించింది. కొత్తగా ప్రైవేటు రైళ్ల మార్గాలు, ధరలను నిర్ణయించే స్వేచ్ఛ, దీర్ఘకాలంలో బలమైన నగదును సృష్టించే వ్యాపారం, అధిక ఆర్‌వోసీఈ, మంచి డివిడెండ్‌ రాబడి కారణంగా ఐఆర్‌సీటీసీ దీర్ఘకాల ఇన్వెస్టర్లు తప్పకుండా పరిశీలించాల్సినది’’ అని తాప్సే అభిప్రాయపడ్డారు. 

 

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ స్టాక్‌ 42.5 పీఈ వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత ఎర్నింగ్స్‌ ప్రకారం ఇది సహేతుకమేనన్నారు ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈవో అమిత్‌గుప్తా. ‘‘సెప్టెంబర్‌ 1 నుంచి ఐఆర్‌సీటీసీ నాన్‌ ఏసీ టికెట్ల బుకింగ్‌పై రూ.15 కన్వీనియన్స్‌ ఫీజును, ఏసీ టికెట్లపై రూ.30 చొప్పున చార్జీ విధించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం వార్షికంగా బుక్‌ అవుతున్న టికెట్ల ప్రకారం చూస్తే రూ.825 కోట్ల మేర ఆదాయం ఈ ఒక్క చర్య రూపంలోనే సమకూరనుంది. ప్రస్తుత ఆదాయం రెట్టింపు కానుంది’’ అని గుప్తా వివరించారు. ఈ నేపథ్యంలో సంవత్‌ 2076లో ఐఆర్‌సీటీసీ స్టాక్‌ రెట్టింపు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే దీపావళికి ఈ స్టాక్‌ రూ.2,000ను చేరుతుందని గుప్తా అంచనా వేశారు.You may be interested

మరో పావు శాతం తగ్గిన ఫెడ్‌ రేటు

Thursday 31st October 2019

ఫెడ్‌ ఫండ్స్‌ రేటు 1.5 శాతం నుంచి 1.75 శాతానికి ! ఈ ఏడాది ఇది మూడో తగ్గింపు  అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పావు శాతం మేర రేట్లను తగ్గించింది. రెండు రోజుల పాటు జరిగి బుధవారం ముగిసిన సమావేశంలో ఫెడ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ, ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్‌లో ఉన్న ‘ఫెడ్‌ ఫండ్స్‌ రేటు’ను 1.5

ఇవి భలే లాభసాటి..!

Thursday 31st October 2019

నిఫ్టీ-50 తన కీలక నిరోధ స్థాయిలు 11,700-11,800ను ఎట్టకేలకు అధిగమించి పైన క్లోజవడంతో, గత గరిష్ట స్థాయి 12,103ను పరీక్షించే దిశగా వెళుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. దీంతో ప్రధాన సూచీ కీలకమైన స్వల్ప కాల, దీర్ఘకాల సగటు చలనాలకు పైకి చేరడం బుల్లిష్‌నెస్‌కు సంకేతంగా పేర్కొంది. కొనసాగుతున్న నిర్మాణాత్మక మార్పులతో ఇండెక్స్‌ తిరిగి తన ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 12,100ను రానున్న నెలల్లో సవాలు చేయగలదని భావిస్తున్నట్టు ఐసీఐసీఐ

Most from this category