News


ఐఆర్‌సీటీసీ ఐపీఓ: విశ్లేషకుల అభిప్రాయమిదే..!

Saturday 28th September 2019
Markets_main1569653639.png-28602

  • సోమవారం ప్రారంభం కానున్న ఇష్యూ 

ప్రభుత్వ రంగ ఇండియన్‌ కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ సోమవారం ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 3న ముగుస్తుంది.  ఐపీఓ ధర శ్రేణి రూ.315–320గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఇష్యూ సైజు రూ.645 కోట్లు. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 2.01 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఈ మొత్తంలో ఉద్యోగులకు 1,60,000 షేర్లను కేటాయించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.10 డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. స్టాక్‌ మార్కెట్లో  ఈ షేర్లు వచ్చే నెల 14న లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ సర్వీసెస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, యస్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) వ్యవహరిస్తున్నాయి. 

ఐపీఓకు సహేతకమైన వాల్యూవేషన్‌ ఉండటంతో ఇష్యూను సబ్‌స్క్రెబ్‌ చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వ్యాపారం:- రోజుకు 1.4 మిలియన్‌ ప్రయాణాలను తమ గమ్యస్థానాలకు చేర్చే రైల్వేరంగంలో మినిరత్నగా హోదా కలిగిన ప్రభుత్వరంగ ఐఆర్‌సీటీసీ సంస్థ ఆన్‌లైన్‌ టికెటింగ్‌, టూరిజం, భోజనం, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ సేవలను అందిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 5నెలల్లో దాదాపు 75శాతం టికెట్లు ఐఆర్‌సీటీసీ సంస్థను నుంచే బుకింగ్‌ చేసుకున్నారు. కంపెనీ సొంతంగా 10 ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిలింగ్‌ ప్లాంట్‌లను కలిగి ఉంది. కంపెనీ యొక్క ప్రధాన ఆదాయ వనరు కేటరింగ్‌ విభాగం. అయితే ఈ వ్యాపారపు ఫ్రాఫిట్‌ మార్జిన్‌ తక్కువగా ఉంది. ఆన్‌లైన్‌ టికెట్‌ విభాగం నుంచి ఆదాయ వనరు గత మూడేళ్ల నుంచి కొంత తగ్గింది. కేంద్ర రైల్వేశాఖ 2016లో ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసేకునే పాసింజర్ల పన్ను విధించడం ఇందుకు కారణమైంది. అయిన్పటికీ, ఈ సెప్టెంబర్‌ 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్ను విధానం ఆదాయాన్ని పెంచుతుందనే ఆశాభావాన్ని ఐఆర్‌సీటీసీ వ్యక్తం చేస్తుంది. ఇంటర్నెట్‌ టికెట్‌ బుకింగ్‌లో అత్యధికంగా ఐఆర్‌సీటీసీ ద్వారానే జరుగుతున్నాయి. 
 
ఆదాయ విశ్లేషణ:- ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయంలో కేటరింగ్‌ విభాగం ద్వారా 55శాతం, టూరిజం విభాగం ద్వారా 23.4శాతం, ఇంటర్నెట్‌ టికెట్‌ బుకింగ్‌ నుంచి 12.4శాతం, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ వ్యాపారం ద్వారా 9.2శాతం వచ్చింది. 

ఫైనాన్షియల్స్‌:- కంపెనీ నికర విలువ మార్చి నాటికి రూ. 1,043 కోట్లుగా ఉంది. ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయి. ఎలాంటి అప్పులు లేవు. డెట్‌ ఫ్రీ బ్యాలెన్స్‌ షీట్‌ కంపెనీ. ఏడాది ప్రాతిపాదికగా  కంపెనీ అమ్మకాలు 25శాతం పెరిగి రూ.1,899 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే నికర లాభం 23.5శాతం పెరిగి రూ.272.5 కోట్లకు పెరిగింది. గత మూడు  ఆర్థిక సంవత్సరాల నుంచి కంపెనీ వార్షిక వృద్ధి రేటు 10శాతంగా ఉంది. నికర లాభం వృద్ధి 9.1శాతంగా ఉంది. మూడేళ్ల ఎబిటా మార్జిన్‌ సరాసరి 19.6శాతం శాతంగా నమోదైంది. చివరి మూడేళ్ల నుంచి క్రమం తప్పకుండా  కంపెనీ షేర్‌ హోల్డర్లకు డివిడెండ్‌ను పంచుతోంది. డివిండెండ్‌ రేటు కూడా పెరుగుతూ వస్తుంది. ఆర్థిక సంవత్సరం 2017లో 37శాతంగా ఉండగా ఈ ఏడాది అది 45శాతానికి చేరింది.
వాల్యూవేషన్స్‌:-  కంపెనీ అప్పర్‌ ప్రైస్‌బాండ్‌ రూ.320గా నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరపు ఈపీఎస్‌ రూ.17ల కంటే షేరు పీ/ఈ విలువ 18.8 రెట్లుకు ఈ ధరను నిర్ణయించారు. You may be interested

నష్టాల్లో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 28th September 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం రాత్రి నష్టంతో ముగిసింది. ఇది 11,531.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11579.50 పాయింట్లతో పోలిస్తే 48 పాయింట్ల నష్టంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పంద ఆశలు సన్నగిల్లడం

యుఎస్‌ ఎక్సేంజ్‌ల నుంచి చైనా కంపెనీల డీలిస్టింగ్‌?

Saturday 28th September 2019

యుఎస్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ల నుంచి చైనా కంపెనీలను డీ లిస్టింగ్‌ చేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే వార్తల నేపథ్యంలో శుక్రవారం యుఎస్‌ మార్కెట్‌లు భారీగా నష్టపోయాయి. చైనా కంపెనీలలోకి యుఎస్‌ పెట్టుబడులు వెళ్లకుండా ఉండేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఈ చర్యను తీసుకోనుందని పరిశీలకులు తెలిపారు. ఈ చర్య వలన గత ఏడాది కాలం నుంచి కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ తిరిగి పుం‍జుకున్నాయని విశ్లేషకులు తెలిపారు. కాగా

Most from this category