News


ఐఆర్‌సీటీసీ ఐపీఓ: రెండో రోజే 100శాతం సబ్‌స్క్రిప్షన్‌

Tuesday 1st October 2019
Markets_main1569912595.png-28653

రైల్వేరంగంలో సేవలందించే ఐఆర్‌సీటీసీ ఐపీఓకు రెండో రోజూ అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు 81శాతం సబ్ స్క్రైబ్ కావడంతో అదే ఉత్సాహంతో మంగళవారం ఉదయం కల్లా 100శాతం సబ్‌స్క్రిప్షన్‌ సాధించింది. నేటి ఉదయం గం.10:30 కల్లా 2.18 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలైన ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 03 వరకు బిడ్లను స్వీకరిస్తారు. కేంద్ర ప్రభుత్వ రైల్వేలకు చెందిన ఆన్‌లైన్‌ టికెటింగ్‌, టూరిజం, కేటరింగ్‌ సంస్థ ఐఆర్‌సీటీసీ ఐపీఓ ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 2.1 కోట్ల షేర్లను జారీ చేసింది.  ఐపీఓ సైజు రూ.645 కోట్లుగా ఉంది. ఒక్కో షేరు మద్దతు ధర రూ.315-320లుగా నిర్ణయించారు. మొదటి రోజు నాన్‌-ఇన్‌స్టిస్ట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌ విభాంగంలో 21శాతం, రిటైల్‌ విభాగంలో 2.23 రెట్లు అధికంగా బిడ్స్‌ లభించడంతో మొదటి రోజు 81శాతం షేర్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఐపీఓకు సహేతుకమైన వాల్యూవేషన్‌ ఉండటంతో పాటు రైల్వేరంగంలో ఏకఛత్రాదిపత్యం వహించిన కంపెనీ కావడంతో పలు బ్రేకరేజ్‌ సంస్థలు ఇష్యూకు సబ్‌స్క్రైబ్‌ రేటింగ్‌ను కేటాయించాయి. ఈ ఆఫర్‌లో ప్రభుత్వం 12.50శాతం వాటాకు సమానమైన 2.01 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది.  ఈ మొత్తంలో ఉద్యోగులకు 1,60,000 షేర్లను కేటాయించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.10 డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. స్టాక్‌ మార్కెట్లో  ఈ షేర్లు వచ్చే నెల 14న లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ సర్వీసెస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, యస్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) వ్యవహరిస్తున్నాయి. 



You may be interested

ఓఎంసీలను జీఆర్‌ఎం కాపాడుతుంది!

Tuesday 1st October 2019

క్యు2లో మంచి లాభాల నమోదుకు అవకాశాలు నిపుణుల అంచనా అంతర్జాతీయ మందగమన సంకేతాల నేపథ్యంలో కూడా సెప్టెంబర్‌ త్రైమాసికంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలను నమోదు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇన్వెంటరీ నష్టాలు, వినిమయం తగ్గడం కారణంగా పెరిగిన మార్జిన్ల నుంచి వచ్చే లాభాలు పరిమితం కావచ్చంటున్నారు. ప్రధానమైన ఓఎంసీలు నికర లాభంలో తరుగుదలకు క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం కారణం అవుతుంటాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర తొలి త్రైమాసికం చివర్లో, రెండో త్రైమాసికంలో

ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ సంకేతాలు!

Tuesday 1st October 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 156 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటర్స్‌, హీరోమోటోకార్‌‍్ప, టాటాపవర్‌, ఐబీ హౌసింగ్‌, ఐబీ వెంచర్స్‌, థామస్‌ కుక్‌, కాడిలా హెల్త్‌కేర్‌, ఆర్‌క్యాప్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, అదానీ గ్యాస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో

Most from this category