News


ఐఆర్‌సీటీసీ ఐపీఓ: గంటలో 8 శాతం షేర్లకు బిడ్స్‌

Monday 30th September 2019
Markets_main1569830527.png-28626

  ప్రభుత్వ సంస్థయిన ఐఆర్‌సీటీసీ ఐపీఓ(ఇనిసియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ రోజు ప్రారంభమయ్యింది. ప్రారంభమైన మొదటి గంటలోనే మొత్తం ఇష్యు చేసిన షేర్లలో 8 శాతం షేర్లకు బిడ్లు దాఖలు ఖావడం గమనార్హం. ఐఆర్‌సీటీసీ, ఐపీఓలో మొత్తం 2,01,60,000 షేర్లను అందుబాటులోకి తీసుకురాగా, ఉదయం 11 గంటల సమయానికి 16,06,560 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఐపీఓ ధర పరిధిని షేరుకు రూ. 315- 320 వద్ద ఐఆర్‌సీటీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. 
   ఆర్థిక సంవత్సరం 2019 ఈపీఎస్‌(షేరుపై లాభం) రూ.17కు 18.8 రెట్ల పీఈ(ప్రైస్‌ ఎర్న్‌ రేషియో) మల్టిపుల్‌​వద్ద ఎగువ ధర పరిధి(అప్పర్‌ ప్రైస్‌ బాండ్‌)తో ఈ స్టాకు లభ్యమవుతోంది. కాగా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఐఆర్‌సీటీసీని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద తీసుకొచ్చింది.
నాలుగు విభాగాల్లో ఐఆర్‌సీటీసీ..
  ఐఆర్‌సీటీసీ,  www.irctc.co.in వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. జూన్‌ 30 నాటికి, ఐఆర్‌సీటీసీ నెలకు సగటున 150 నుంచి 180 లక్షల లావాదేవీలను జరిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఇంటర్నేట్‌ టికెటెంగ్‌, క్యాటరింగ్‌, రైల్‌ నీర్‌ బ్రాండ్‌ కింద ప్యాకెజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ను, ట్రావెల్‌ అండ్‌ టూరిజం వంటి నాలుగు వ్యాపారాలను నిర్వహిస్తోంది. రైల్వే టికెట్స్‌పై ఫీజు సౌకర్యవంతంగా ఉండడంతోపాటు, వచ్చే రెండేళ్లలో ఇంకో పది వాటర్‌ ప్లాంట్‌లను స్థాపించడానికి సంస్థ ప్రయత్నిస్తుండడం, ప్రభుత్వం ట్యాక్స్‌ను తగ్గించడం వలన ఐఆర్‌సీటీసీ ఈపీఎస్‌ వృద్ధి బాగుంటుందని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. ‘ డివిడెండ్‌ చెల్లింపులు(ఆర్థిక సంవత్సరం 2019లో 45 శాతం), ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ)(26.1 శాతం) రెండు కూడా బాగుండడంతో ఆఫర్‌ ధర వద్ద సబ్‌స్ర్కైబ్‌ అవ్వమని సలహాయిస్తున్నాం. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం 2021ఈ(ఆదాయాలు) ఈపీఎస్‌కు పీఈ 10 రెట్లు మల్టిపుల్‌ వద్ద ఐఆర్‌సీటీసీ షేరు లభ్యమవుతోంది. భవిష్యత్‌లో ఈ కంపెనీ లాభాల వృద్ధి ఆశాజనకంగా ఉంది’ అని ఈ బ్రోకరేజి తెలిపింది. ‘ఆర్థిక సంవత్సరం 2019 ఆదాయాలకు 19 రెట్లు పీఈ వద్ద ఐపీఓ ఆకర్షిణియంగా ఉంది. సబ్‌స్క్రైబ్‌ అవ్వమని ఇన్వెస్టర్లకు సిఫార్సు చేస్తున్నాం’ అని ఇండియానివేస్‌ ఓ నివేదికలో తెలిపింది.You may be interested

హెచ్‌డీఐఎల్‌ .. లోయర్‌ సర్క్యూట్‌ !

Monday 30th September 2019

పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకు సంక్షోభానికి కారణమైనట్లు భావిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హెచ్‌డీఐఎల్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 5శాతం నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అయ్యాయి. పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ ఆస్తులు రూ.8,800 కోట్లు కాగా, ఇందులో రూ.6,500 కోట్లకు పైగా ఒక్క హెచ్‌డీఐఎల్‌కే ఇవ్వడం జరిగినట్టు సస్పెండైన బ్యాంకు ఎండీ జాయ్‌థామస్‌ అంగీకరించినట్టు సమాచారం. బ్యాంకు మొత్తం రుణ ఆస్తుల్లో ఈ

రియల్‌ ఎస్టేట్స్‌ షేర్ల భారీ పతనం

Monday 30th September 2019

ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ షేర్ల భారీ పతనంతో సోమవారం నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 261.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సంస్థలో మోసం జరిగిందనే ఆరోపణలపై కోర్టు దర్యాప్తునుకు ఆదేశించిన నేపథ్యంలో తన సహచర కంపెనీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఒకరోజులో అతిపెద్ద నష్టాన్ని చవిచూసి ఐదేళ్ల కనిష్టానికి పతనమైంది. ఈ ప్రభావంతో ఇదే

Most from this category