News


ఐఆర్‌సీటీసీ అద్భుత ప్రదర్శన ఎందుకు..?

Tuesday 18th February 2020
Markets_main1581964635.png-31867

రైల్వే శాఖ అనుబంధ కంపెనీ ఐఆర్‌సీటీసీ ఐపీవోకు వచ్చిన ఐదు నెలల్లోనే ఐదింతలు పెరిగి ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను ఇచ్చింది. అక్టోబర్‌ 3న ఐపీవో ముగియగా ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.320. ప్రస్తుత ధర రూ.1518. ఈ అసాధారణ ర్యాలీ ఇన్వెస్టర్లను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ, ఇందుకు సహేతుక కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.

 

స్థిరమైన పనితీరు
ఐఆర్‌సీటీసీ అన్నది భిన్నమైన కంపెనీ. లిస్టెడ్‌ కంపెనీల్లో ఈ తరహా వ్యాపారం కలిగిన కంపెనీ ఇదొక్కటే. బారతీయ రైల్వేకు ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయ సేవలను అందించే హక్కులను కలిగి ఉన్నది. అలాగే, రైల్వే ప్రయాణికులకు కేటరింగ్‌ సేవలు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ వంటి వ్యాపారాల్లోనూ గుత్తాధిపత్యం కలిగి ఉంది. ఐఆర్‌సీటీసీ డాట్‌ కో డాట్‌ ఇన్‌ లేదా ఐఆర్‌సీటీసీ మొబైల్‌ యాప్‌ లేదా రైల్‌ కనెక్ట్‌ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలను అందిస్తోంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌లు ఏటా 12.5 శాతం చొప్పన వృద్ధి చెందుతున్నాయి. 71 శాతం రైల్వే టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ అవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

 

బలమైన వృద్ధి
ఐఆర్‌సీటీసీ ఈ కేటరింగ్‌ సేవల వ్యాపారం చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. స్టేషన్‌ ఆధారిత ఈ కేటరింగ్‌ సేవలను ఈ సంస్థ 2014లో ప్రారంభించింది. ప్రారంభంలో 14 రైళ్ల ప్రయాణికులకు ఆహార పదార్థాలను ఆర్డర్‌పై కోరుకున్న స్టేషన్‌ వద్ద అందించే సేవలను మొదలు పెట్టింది. 2015లో 201 రైళ్లకు, 2017 నాటికి 409 స్టేషన్లకు సేవలను విస్తరించింది. ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ యాప్‌ ద్వారా లేదా 1323 నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా రైల్వే ‍ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్‌ చేయవచ్చు. 2019 జూలై నాటికి 700 పార్టనర్‌ రెస్టారెంట్లు యాప్‌లో లిస్ట్‌ అయ్యాయి. ఐఆర్‌సీటీసీ యాప్‌ ద్వారా తాము అందుకునే ప్రతీ ఆర్డర్‌ విలువలో 12 శాతాన్ని కమీషన్‌ కింద రెస్టారెంట్లు చెల్లించాల్సి ఉంటుంది. రోజువారీ ఆర్డర్ల సంఖ్య 2018 జూలై నాటికి 8,500 ఉండగా, 2019 జూలై నాటికి 20,000కు పెరిగింది. ఈ కాలంలో ఈ కేటరింగ్‌ సేవలు కాంపౌండెడ్‌గా 600 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసినట్టు. 2018-19లో 40 కోట్ల ఆర్డర్లను స్వీకరించింది. ఇంటర్నెట్‌ వ్యాప్తి, రెస్టారెంట్ల సంఖ్య విస్తృతమవడం ఫుడ్‌ ఆర్డర్లు భారీగా పెరిగేందుకు కారణమవుతోంది. మరిన్ని స్టేషన్లు, రైళ్లకు ఈ సేవలను విస్తరించే ప్రణాళికతో ఐఆర్‌సీటీసీ ఉంది.

 

నూతన టెక్నాలజీ
ఐఆర్‌సీటీసీ కస్టమర్లకు అందించే సర్వీసులను కూడా విస్తృతం చేస్తోంది. ఐఆర్‌సీటీసీ ఈ వ్యాలెట్‌, ఎస్‌బీఐతో కలసి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను గతంలోనే ప్రారంభించింది. ఐఆర్‌సీటీసీ ఐముద్రా, ఐపేలను అభివృద్ధి చేస్తోంది. దీనికి అదనంగా ప్రైవేటు ప్రీమియం రైళ్ల సేవల్లోకీ అడుగుపెట్టింది. ఇప్పటి వరకు మూడు రైళ్లను ఇలా ప్రారంభించింది. ఇంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న కంపెనీ అయిన ఐఆర్‌సీటీసీ షేరును అధిక వ్యాల్యూషన్‌లో ఉన్నట్టుగా చూడడం సరికాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. 2020-21 ఆర్థిక సంవత్సరం అంచనా ఎర్నింగ్స్‌తో చూస్తే 30 పీఈలోనే అందుబాటులో ఉందని చెబుతున్నారు. డీమార్ట్‌ 130 పీఈలో ఉండడానికి, ఆ సంస్థ చూపిస్తున్న క్రమానుగత అసాధారణ వృద్ధి కారణమని తెలిసిందే. ఐఆర్‌సీటీసీని కూడా ఇలాగే చూడాలంటున్నారు. You may be interested

త్వరలోనే ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ !

Tuesday 18th February 2020

ఈ నెల చివర్లో... లేదా మార్చి మొదట్లో ఇష్యూ పరిమాణం రూ.6,000 కోట్లపైనే ముకేశ్‌ ట్రెండ్స్‌ లైఫ్‌ స్టైల్‌ ఐపీఓకు సెబీ ఓకే న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) క్రెడిట్‌ కార్డ్‌ విభాగం, ఎస్‌బీఐ కార్డ్స్ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల చివరి వారంలో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ఉండొచ్చని సమాచారం. ఈ ఐపీఓకు ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం

ముకేశ్‌ మీడియా వ్యాపారాలన్నీ నెట్‌వర్క్‌ 18 కిందకు

Tuesday 18th February 2020

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన మీడియా, పంపిణీ వ్యాపారాలను విలీనం చేసి ఒకే సంస్థగా ఏర్పాటు చేయనుంది. టెలివిజన్‌ 18 బ్రాడ్‌కాస్ట్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌లను నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో విలీనం చేయనుంది. మెత్తం మీడియా వ్యాపారం అంతా  నెట్‌వర్క్‌ 18 కింద కొనసాగనుంది. కేబుల్‌ అండ్‌ ఐఎస్‌పీ వ్యాపారం రెండు సొంత సబ్సిడరీలుగా నెట్‌వర్క్‌ 18 కింద నడుస్తాయి.

Most from this category