News


10 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రెబైన ఇర్కాన్‌ ఐపీఓ

Thursday 20th September 2018
Markets_main1537428953.png-20407

  • ఈ నెల 28న స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ !

న్యూఢిల్లీ: రైల్వే ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇర్కన్‌ ఇంటర్నేషనల్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 9.85 రెట్లు ఓవర్‌స్క్రైబయింది. సోమవారం ఆరంభమైన ఈ ఐపీఓ బుధవారం ముగిసింది. ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ రూ.470-475గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.470 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 99 లక్షల షేర్లను ఆఫర్‌ చేస్తుండగా, 9.75 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు(క్విబ్‌)లకు కేటాయించిన వాటా 12 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 4.9 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వటా 9.51 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ షేర్లు ఈ నెల 28న స్టాక్‌ మార్కెట్లో  లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చిన రెండో ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఈ ఏడాదిజూన్‌లో రైల్వేలకే చెందిన రీట్స్‌  కంపెనీ ఐపీఓకు వచ్చింది.



You may be interested

భెల్‌కు భారీ ఆర్డర్లు

Thursday 20th September 2018

63 శాతం పెరిగిన నికర లభం 91 శాతం డివిడెండ్‌ కంపెనీ ఏజీఎమ్‌లో వెల్లడించిన సీఎమ్‌డీ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ దిగ్గజం, భెల్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.40,932 కోట్ల ఆర్డర్లు సాధించింది. అంతకు ముందటి ఆర్డర్లతో పోల్చితే ఇది 74 శాతం అధికమని భెల్‌ సీఎమ్‌డీ అతుల్‌ సోబ్తి తెలిపారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి తమ ఆర్డర్ల బుక్‌ రూ.1,18,000 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఇదే

రోబో సిలికాన్‌ మరో 9 ప్లాంట్లు

Thursday 20th September 2018

రెండేళ్లలో రూ.90 కోట్ల పెట్టుబడి కంపెనీ సీఈవో సుమ్నేష్‌ ఖండెల్వాల్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రోబో బ్రాండ్‌తో ఇసుక తయారీ, విక్రయంలో ఉన్న రోబో సిలికాన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, విజయవాడ, బెంగళూరు, మంగళూరు, దాద్రిలో మొత్తం 11 ప్లాంటున్నాయి. రెండేళ్లలో మరో 9 తయారీ కేంద్రాలను స్థాపించనున్నట్టు రోబో సిలికాన్‌ సీఈవో సుమ్నేష్‌ ఖండెల్వాల్‌ తెలిపారు. ఫైనాన్స్‌ హెడ్‌ అమిత్‌ జైన్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో

Most from this category